పేరు మార్చుకున్న చందమామKajal Aggarwal
2021-02-08 17:44:07

చందమామ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ "మగధీర" సినిమాతో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అప్పటినుండి ఈ భామ కెరీర్ లో వెనక్కు చూసుకోలేదు. ఇక ఇటీవల పెళ్లి పీటలెక్కిన కాజు ఓ వైపు సినిమాలతో మరోవైపు వైవాహిక జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. నిజానికి అది అంత ఈజీ కాదు కాని కాజల్ అగర్వాల్ రెండింటిని సరిగ్గానే బ్యాలెన్స్ చేస్తున్నట్టు పెళ్ళైన తక్కువ కాలంలోనే అందరికీ తెలిసేలా చేసింది. ఎలాగంటే పెళ్లి తరవత హనీమూన్ కు వెళ్లిన కాజల్ హానీ మూన్ బిజిలో కూడా ఓ బ్రాండ్ ప్రమోషన్ చేసింది. ఇక ఈ అమ్మడు పెళ్లి జీవితాన్ని..తన కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తుందనటానికి ఇదే నిదర్శనం. ఇక తన మిత్రుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లాడిన కాజల్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలోను పేరు మార్చుకుంది. ఇదివరకు ఈ అమ్మడి పేరు సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ అని ఉండగా..ఇప్పుడు కాజల్ ఎ కిచ్లు అని మార్చుకుంది. మొత్తానికి చందమామ తనలో తన భర్త అర్థభాగం అని ఇలా చెప్పేసింది.

More Related Stories