ఉప్పెన మూవీ రివ్యూUppena
2021-02-12 22:27:53

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను వెండి తెరకు పరిచయం చేసిన సినిమా "ఉప్పెన". సినిమాలో పాటలు భాగుండటం, ట్రైలర్ లో డైలాగులు పేలడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా చూసిన మెగాస్టార్ ఇలాంటి సినిమా టాలీవుడ్ లో ఇప్పటివరకు రాలేదని అన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ కన్నీళ్లు పెట్టించేలా ఉంటుందని అన్నారు. మరోవైపు నటీనటులు, దర్శకులు కూడా సినిమా సూపర్ అంటూ హైపును క్రియేట్ చేసారు. ఇక ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను రీచ్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

మొదటి సీన్ లోనే బీచ్ లో దెబ్బలతో పడిపోయి ఉంటాడు వైష్ణవ్ తేజ్ (ఆశీర్వాదం). అక్కడ కట్ చేస్తే మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి ఎంటర్ అవుతాం. ఉప్పాడ గ్రామం లో ఆశీర్వాదం ఒక పేద జాలరి కుటుంబానికి చెందిన వాడు. ఆశీర్వాదం కు చిన్నప్పటి నుండి బేబమ్మ (కృతి శెట్టి) అంటే విపరీతమైన ప్రేమ. బేబమ్మ ఎక్కడికి వెళ్లినా ఆశీర్వాదం ఆమెను ఫాలో చేస్తూ ఉంటాడు. ఇక బేబమ్మ కూడా కాలేజీలో చదువుతున్నప్పుడు ఆశీర్వాదం తో ప్రేమలో పడుతుంది. ఇంకేముందు అన్ని   సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా ఎవ్వరికీ తెలియకుండా బేబమ్మ, ఆశీర్వాదం కలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఒకరోజు ఇద్దరూ బీచ్ లో తిరుగుతుండగా బేబమ్మ తండ్రి  రాయణం (విజయ్ సేతుపతి) కంట పడతారు. సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర రాయణం తన పరువుకోసం ప్రతిష్ట కోసం దేనికైనా వెనుకాడని మనిషి. ఈ నేపథ్యంలో బేబమ్మ, ఆశీర్వాదం ఎలా ప్రేమించుకున్నారు. వాళ్ళను విడదీయడానికి తన పరువు ప్రతిష్టలను కాపాడుకోవడానికి రాయణం ఏం చేశాడు.? అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :  

సినిమాలో పాటలు..ట్రైలర్ లో వచ్చిన డైలాగులతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరోవైపు మెగాస్టార్ లాంటి నటుడు సినిమా సూపర్ అని చెప్పాడు. అంతే కాకుండా సుకుమార్ అయితే ఈ సినిమా 100కోట్లు కలెక్ట్ చేస్తుందని సినిమా పై అంచనాలను మరింత పెంచేసాడు. దాంతో బుచ్చిబాబు అంత గొప్ప సినిమా తీసాడా అని అంతా అనుకున్నారు. సినిమా ఒక రేంజ్ లో ఉంటుందేమో అని అనుకున్నారు. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ ప్రేమ కథ ఇద్దరి మధ్య జరిగే సన్నివేశాలు , నటీనటుల పర్ఫామెన్స్, విజువల్స్ తో ఎక్కడా బోర్ కొట్టకుండా పరవలేదనిపిచ్చింది. కానీ సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం భాగా రాసుకుని ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో మరో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అంతే కాకుండా సన్నివేశాలు ఆసక్తిగా ఉండక పోగా వేగం కూడా తగ్గుతుంది. దాంతో అంతా గందరగోళంగా అనిపిస్తుంది. ఇది పక్కన పెడితే మళ్లీ క్లైమాక్స్ దగ్గర బుచ్చిబాబు సినిమాను లేపే ప్రయత్నం చేశారు. దాంతో సినిమాను ప్రీ క్లైమాక్స్, క్లైమాస్ సాన్నివేశాలు నిలబెట్టాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే  తొలి సినిమా అయినప్పటికీ ఎక్కడా బోర్‌ కొట్టించకుండా అనుకున్న కథను కళ్లకు కట్టినట్లుగా తెరపై చూపించాడు. తనదైన స్క్రీన్‌ప్లేతో  పాత స్టోరీకి ట్రీట్‌మెంట్ కాస్త డిఫరెంట్‌గా ఇచ్చాడు. 

More Related Stories