బ్ర‌హ్మాస్త్రలో తన పాత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న నాగార్జునNagarjuna
2021-02-16 11:58:15

కింగ్ నాగార్జున ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్రలో నటిస్తున్న  తెలిసిందే. ఈ సినిమాను హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ భాష‌ల్లో తెరకెక్కిస్తున్నారు. సినిమాను బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్ లుగా బాలీవుడ్ డ్రీమ్ బాయ్ ర‌ణ‌బీర్ కపూర్, డ్రీమ్ గర్ల్ అలీయ‌భ‌ట్ నటిస్తుండగా నాగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం బాంబే లో ఓ భారీ సెట్ లో న‌డుస్తోంది. అయితే తాజాగా బ్రహ్మస్త్రలో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకునట్టు నాగార్జున వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసారు. 

బ్ర‌హ్మాస్త్ర వంటి ఇండియాలోనే అతి భారీ బ‌డ్జెట్ సినిమాలో న‌టించ‌డం త‌నకు చాలా ఆనందాన్ని ఇచ్చింద‌ని, ఓ సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుడి మాదిరిగా తాను కూడా ఈ సినిమా విడుద‌ల కోసం వేచి చూస్తున్న‌ట్లుగా నాగార్జున తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోల్లో నాగ్ తో పాటు అలియా భట్ , రన్బీర్ కపూర్ ఉన్నారు. వారితో పాటు దర్శకుడు కూడా ఉన్నాడు. ఇక ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో మొదటి సారి నాగార్జున పాన్ ఇండియా మూవీలో నటించారు. అంతే కాకుండా ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా నాగ్ దగ్గర కాబోతున్నారు. 
 

More Related Stories