ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకున్న లైకా ప్రొడక్షన్స్RRR
2021-02-17 17:45:57

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా..చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక చరణ్ కు జోడిగా అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే క్లైమాక్స్ చేరుకుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేయబోతునట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా తమిళనాడు థియేట్రికల్ రైట్స్ ను లైకా ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. బహుబకి సినిమాతో రాజమౌళికి వచ్చిన క్రేజ్ తో లైకా ఈ సినిమాను ఎక్కువ మొత్తానికే సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా బాహుబలి 2 కి వచ్చిన కలెక్షన్ లను దృష్టిలో ఉంచుకుని లైకా ఆర్ఆర్ఆర్ థియేటర్ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక లైకా ప్రొడక్షన్స్ ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమా రోబో 2.ఓ ను తెరకెక్కించింది.

More Related Stories