నితిన్ చెక్ మూవీ రివ్యూNithiin Check
2021-02-26 20:22:25

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరోగా నటించిన సినిమా "చెక్". ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ లుగా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ లు నటించారు. మనసంతా సినిమా తరువాత మళ్ళీ కొత్త కథనం తో చంద్రశేఖర్ యేలేటి నాలుగేళ్ళ తరవాత చెక్ తో వచ్చాడు. సినిమాలో సంపత్ రాజ్, పోసాని,  సాయి చంద్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ లాయర్ గా అలరించింది. ఇక ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ లు ఇంట్రెస్టింగ్ గా ఉండటం..సినిమాలో నితిన్ ఖైదీగా..రకుల్ లాయర్ గా నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చెక్ ఆ అంచనాలను అందుకుండా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ &కథనం : సినిమా మోదలవ్వగానే కోర్ట్ రూమ్ డ్రామా సీన్లతో మొదలవుతుంది. ఆదిత్య (నితిన్) టెర్రరిస్తులకు సహాయం చేసినందుకు గాను జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. దేశ ద్రోహం కింద నితిన్ కు జీవిత ఖైదు అమలు చేసి జైల్లో పెడతారు. జీవితం పై అన్ని ఆశలు కోల్పోయిన ఆదిత్యకు మానస (రకుల్ ప్రీత్ సింగ్) రూపంలో మళ్ళీ జీవితంపై ఆశలు కలుగుతాయి. మానస ఆదిత్య కేసును టెకప్ చేయాల్సి వస్తుంది. దాంతో ఆదిత్య, మానస మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఆదిత్య తన ఫ్లాష్ బ్యాక్ ను మనసతో షేర్ చేసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఆదిత్యకు యాత్ర (ప్రియా వారియర్) కు మధ్య ఒక లవ్ స్టొరీ ఉంటుంది. అయితే ఇంటర్వెల్ ముందు ఒక చిన్న ట్విస్ట్ కథను మలువు తిప్పుతుంది. సహజంగా చెస్ క్రీడాకారుడు అయిన ఆదిత్య చెస్ చాంపియన్ షిప్ ఆటల్లో పాల్గొంటారు. అలా జైల్లో చెస్ మాస్టర్ గా మారుతాడు. అంతే కాకుండా గ్రాండ్ మాస్టర్ టైటిల్ ను సైతం కైవసం చేసుకుంటాడు. అక్కడే సినిమా కు సంబంధించి మరికొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ చోటు చేసుకుంటాయి. ఇక ఆదిత్య తో టెర్రరిస్ట్ లకు అసలు సంబంధం ఏమిటి. జైలు నుండి భయట పడతాడా లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : చంద్రశేఖర్ ఏలేటి లాంటి విలక్షణ దర్శకుడి నుండి ఎలాంటి సినిమాను కోరుకుంటారో అలాంటి సినిమానే చెక్. సినిమా మొదటి భాగం స్పీడ్ స్క్రీన్ ప్లే తో కథకు తగ్గట్టుగా రక్తికట్టించేలా ఉంటుంది. సినిమాలో ప్రీ ఇంటర్వెల్ సీన్లతో సినిమా పై మరింత ఇంట్రెస్ట్ కలుగుతుంది. కొత్త సబ్జెక్టు తో వచ్చినా దర్శకుడు ఎక్కడా తడబడకుండా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడానిపించింది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎలివేట్ చేసే సస్పెన్స్ సీన్లతో సినిమాను భాగా తెరకెక్కించారు. లాజిక్ పై ఎక్కువ దృష్టి పెట్టి ఎమోషన్ పై తక్కువ దృష్టి పెట్టడం తో సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త స్లోగా అనిపిస్తుంది. అయినప్పటికి క్లైమాక్స్ సమయానికి వచ్చేసరికి దర్శకుడు మళ్ళీ సినిమాను లేపడంతో మంచి ఫీలింగ్ కలుగుతుంది. ఇక రోటీన్ మాస్ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.

More Related Stories