మేలో ప్రభాస్ ఎంగేజ్మెంట్.. వధువు ఎవరంటేPrabhas Engagement
2021-03-02 00:07:05

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లి అప్పుడు..ఇప్పుడు అంటూ రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మాత్రం పెళ్లిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ పెళ్లి వార్త ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ప్రభాస్ అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే ఇప్పుడు ప్రభాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ పెళ్లి అతడి బంధువులు అమ్మాయితోనే ఫిక్స్ అయ్యిందట. ఆ అమ్మాయి వయస్సు 25 కాగా మే నెలలో ఎంగేగ్మెంట్ జరగనున్నట్టు తెలుస్తోంది. ఆ అమ్మాయి ప్రస్తుతం అమెరికాలో ఎమ్ఎస్ పూర్తి చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. ప్రభాస్ ఇప్పటికే రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఇక ప్రస్తుతం సలార్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆది పురుష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసుకుంటుంది.

More Related Stories