పబ్ లో సింగర్ సిద్ శ్రీరామ్ కు అవమానంSinger Sid Sriram
2021-03-08 17:35:23

ప్రస్తుతం టాప్ మేల్ సింగర్ లలో సిద్ శ్రీరామ్ పేరు ముందుగా వినిపిస్తుంది. ఎక్కడ చూసినా సిద్ శ్రీరామ్ పాడిన పాటలు ఇప్పుడు మోగిపోతున్నాయి. ఒక సినిమా వస్తే అందులో ఒక్కటైనా సిద్ శ్రీరామ్ పాట ఉందా అని చూస్తున్నారు. ఇటీవల ఆయన పాడిన "నీలి నీలి ఆకాశం, సామజ వరగమన, ఉండిపోరాదే" పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇదిలా ఉండగా తాజాగా ఓ పబ్ లో సిద్ శ్రీరామ్ కు అవమానం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 సి సన్ బర్న్ పబ్ లో సిద్  శ్రీరామ్ కు అవమానం జరిగింది. ఈవెంట్ కు సిద్ హాజరు కాగా అతడిపై నీళ్లు మద్యం చల్లి పోకిరీలు అవమానించారు. దాంతో సిద్ వారికి గెట్ అవుట్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. దాంతో పబ్ నిర్వాహకులు జోక్యం చేసుకుని గొడవకు ఆపారు. సెలబ్రెటీలు పబ్ లో ఉన్నారని నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా దాటవేశారు.

More Related Stories