చావు కబురు చల్లగా మూవీ రివ్యూChaavu Kaburu Challaga Movie Review
2021-03-19 22:25:45

నటీనటులు: కార్తీకేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాఠి, అనసూయ భరద్వాజ్, ఆమని, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, రజిత, మహేష్, భద్రం తదితరులు
రచన, దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
ఎడిటర్: సత్య
డీవోపీ: కామ్ చావ్లా
మ్యూజిక్: జేక్స్ బిజోయ్
ఆర్ట్ డైరెక్టర్: జీఎం శేఖర్
బ్యానర్: జీఏ2 పిక్చర్స్

కథ:  బస్తీ బాలరాజు ( కార్తీకేయ గుమ్మకొండ) శవాలను మోసుకెళ్తే వాహనం డైవర్. జల్సాగా ఎలాంటి బాధ్యతలను పట్టించుకోకుండా జీవించే బాలరాజు.. ఓ చావులో భార్తను కోల్పోయిన మల్లిక (లావణ్య త్రిపాఠి)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తన వెంటపడుతున్న బాలరాజుని మల్లిక  అసహ్యించుకుంటుంది. అలాంటి మల్లిక.. బాలరాజు ప్రేమలో ఎలా పడింది? బ్రతుకు, చావు, పెళ్లి, ప్రేమ నేపథ్యంలో వీరిద్దరి మధ్య దారితీసిన పరిస్థితులు ఏంటి? తండ్రి బతికి ఉండగా కొడుకు తల్లికి పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటాడు.. ఆ తల్లి వేరే వ్యక్తితో ఎందుకు చనువుగా ఉంటుంది? ఆమె ఏమైంది? బాలరాజు ప్రేమ కథకు ఆమెకు లింక్ ఏంటి? అన్నదే మిగిలిన కథ.

కథనం: తొలి భాగంలో వినోదానికి పెద్ద పీట వేసినట్టు కనిపించినా ఎమోషన్స్ సరిగా వర్కవుట్ కాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. మల్లిక వెంట బాలరాజు పడటం లాంటి సీన్లు నత్త నడకగా సాగడం కొంత అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ బాలరాజు, తల్లి గంగి మధ్య సన్నివేశాలు సినిమాపై కొంత క్యూరియాసిటీని పెంచుతాయి.తల్లితో ముడిపడి ఉన్న ఓ భావోద్వేగమైన అంశాన్ని జోడించి కథను మరింత ఎమోషనల్‌గా మార్చడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఆమని వేరే వ్యక్తితో ఎందుకు చనువుగా ఉంటుంది అనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలా చేశారు. అయితే క్లైమాక్స్‌కి వచ్చేసరికి మళ్లీ రొటీన్ ఫార్ములా మాదిరిగానే అనిపిస్తుంది. హీరోయిన్ వేరే పెళ్లికి ఒప్పుకోవడం.. హీరో వెళ్లి నాలుగు మాటలు చెప్పడంతో పేరెంట్స్ మారిపోయి.. హీరోయిన్ హీరో చేతుల్లో పెట్టడం లాంటివి రొటీన్ రోతగానే అనిపిస్తుంది.

నటీనటులు:  చావు కబురు చల్లగా సినిమాలో కార్తీకేయ నటనలో మరింత మెచ్యురిటీ కనిపించింది. ఎమోషనల్ సీన్లలో విజృంభించాడనే చెప్పవచ్చు. కమర్షియల్ హీరోగా, ఫెర్ఫార్మర్‌గాను తన రేంజ్‌ను పెంచుకొన్నాడనే చెప్పవచ్చు. లావణ్య త్రిపాఠి  గ్లామర్‌ హంగులకు స్కోప్ ఉన్న పాత్ర కాకపోయినప్పటికీ యాక్టింగ్‌కి స్కోప్‌ ఉన్న పాత్రలో బాగా చేసింది. సీనియర్ నటి ఆమని గంగమ్మ పాత్రలో తన సీనియారిటీని చూపించింది. మందు కొడుతూ ఊర మాస్ గెటప్‌లో అలరించింది. ఇక ఆమని ప్రియుడి పాత్రలో నటించిన శ్రీకాంత్ అయ్యర్ కామెడీ పండిస్తూనే తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.కమెడియన్ భద్రం, రంగస్థలం మహేష్‌లు హీరో స్నేహితులుగా ఉన్నంతలో కామెడీ బాగానే పండించారు.

టెక్నికల్ టీం: కత్తెర వేయాల్సిన సీన్లు ఫస్టాఫ్‌లో చాలానే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ వెంటపడే సీన్లు తగ్గిస్తే క్రిస్పీగా అనిపించేది. మిగిలిన నిర్మాణ విలువలు సినిమా రేంజ్‌కి తగ్గట్టే ఉన్నాయి. సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన పాటలు బాగున్నాయి. కామ్ చావ్లా సినిమాటోగ్రఫీ బాగానే కుదిరింది.

చివరగా: చావు కబురు చల్లగా చెప్పడం అంత ఈజీ కాదు..!!

రేటింగ్: 2.5/5. 

More Related Stories