ఈవారం కూడా బ‌రిలోకి మూడు సినిమాలు..గెలుపెవ‌రిది Tollywood
2021-03-25 19:21:26

ఈయేడాది బాక్స్ ఆఫీస్ వ‌ద్ద జోరు క‌నిపిస్తోంది. ప్ర‌తివారం మూడు సినిమాలు లేదంటే అంత‌కు మించే బ‌రిలోకి దిగుతున్నాయి. ఇక ఈ వారం కూడా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద పోటీకి దిగేందుకు మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మ‌హాన‌టి కీర్తి సురేష్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సినిమా రంగ్ దే. ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్ప‌టికే సినిమా నుండి విడుద‌లైన పాట‌లు..మరియు ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్ప‌టికే నితిన్ చెక్ సినిమా పోయిన భాద‌లో ఉన్నారు. మ‌రి ఈ సినిమా అయినా అంచ‌నాల‌ను రీచ్ అవుతుందా లేదా చూడాలి. ఇక రానా హీరోగా న‌టించిన భారీ బ‌డ్జెట్ సినిమా అర‌ణ్య‌. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కించారు. 

సినిమా గురించి రానా ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పాడు. అంతే కాకుండా సినిమా టీజర్ మ‌రియు ట్రైల‌ర్ ఆక‌ట్టుకున్నాయి. దాంతో ఈ చిత్రంపై కూడా అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మ‌రి రానా ఆ అంచానాలను రీచ్ అవుతాడా లేడా అన్నాది చూడాలి. ఇక కీర‌వాణి కుమారుడు హీరోగా న‌టించిన సినిమా తెల్లారితే గురువారం. ఈ సినిమాను రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెర‌కెక్కించారు. ఈ మ‌ధ్య వ‌స్తున్న సినిమాల్లో చిన్న సినిమాలే అనూహ్య విజ‌యాన్ని అందుకుంటున్నాయి. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ మూడు సినిమాల్లో ఏసినిమా విజ‌యం సాధిస్తుందో తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు వెయిట్ చేయాల్సిందే. 

More Related Stories