నితిన్ రంగ్ దే రివ్యూ Rang De
2021-03-26 21:17:26

నటీనటులు : నితిన్‌, కిర్తి సురేశ్‌, నరేశ్‌, వెన్నెల కిశోర్‌, కౌసల్య, బ్రహ్మజీ తదితరులు
నిర్మాణ సంస్థ : సితారా ఎంటర్‌టైన్‌మెంట్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
సంగీతం : వీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరాం
ఎడిటింగ్ : నవీన్‌ నూలీ

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈ యేడాది ప్రారంభంలోనే చెక్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఎన్నో అంచనాల మ‌ధ్య విడుద‌లైన చెక్ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. దాంతో నితిన్ త‌న త‌దుప‌రి సినిమా రంగ్ దే తో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ సినిమాకు తొలిప్రేమ చిత్రాన్ని తెర‌కెక్కించిన వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ఈ సినిమాకు ముందు నుండి హైప్ తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. అంతే కాకుండా సినిమా ప్ర‌మోష‌న్స్ ను కూడా గ‌ట్టిగానే చేసారు. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. మ‌రి ఆ అంచ‌నాల‌ను నితిన్ అందుకున్నారా లేదా అన్న‌ది ఇప్పుడు చూద్దాం.

క‌థ : అర్జున్ (నితిన్‌) చ‌దువులో వెన‌క‌బడ్డ కుర్రాడు. ప‌క్కింట్లోకి వ‌చ్చిన అను (కీర్తి సురేష్) చ‌దువులో టాప‌ర్‌. దాంతో అర్జున్ తండ్రి (న‌రేశ్) ఎప్పుడూ కీర్తి తో పోలుస్తూ అర్జున్ ను తిడుతూ ఉంటాడు. దాంతో అర్జున్ కు అను అంటే చిన్న‌ప్ప‌టి నుండి ద్వేషం ఏర్ప‌డుతుంది. స్కూల్ ఏజ్ నుండి బీటెక్ వ‌ర‌కూ ఇద్ద‌రికీ టామ్ అండ జెర్రి వార్ న‌డుస్తూనే ఉంటుంది. వ‌య‌స్సు పెరిగేకొద్ది ఇద్ద‌రి మ‌ధ్య ద్వేషం కూడా పెరుగుతూనే ఉంటుంది. అలా ఒక‌రంటే ఒక‌రికి అస్స‌లు ప‌డ‌ని ఈ జంట అనుకోని ప‌రిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వ‌స్తుంది. అను అంటే అస్స‌లే ఇష్టం లేని అర్జున్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆ త‌రువాత వీరి సంసారం ఎలా సాగింది. అస‌లు క‌లిసి ఉన్నారా..? ఇద్ద‌రి ఈగోలు ప‌క్క‌న పెట్టి ఒక్క‌ట్ట‌య్యారా అన్న‌దే అస‌లు క‌థ‌.

విశ్లేష‌ణ : సాధార‌ణంగా ప‌క్క‌ప‌క్క‌నే ఉండే రెండు కుంటుంబాల క‌థ రంగ్ దే.  మ‌న ఇంట్లో వాళ్ల‌ను ప‌క్కింట్లోవాళ్ల‌తో పోలుస్తుంటాం. పిల్ల‌ల చ‌దువుల ద‌గ్గ‌ర ఈ పోలిక మ‌రీ ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది.ఈ సినిమాలో కూడా అదే క‌నిపిస్తుంది. దాంతో హీరోహీరోయిన్ ల మ‌ధ్య ద్వేశాలు పెరుగుతాయి. అలా  ఒక‌రంటే ఒకరికి ప‌డ‌ని ఇద్ద‌రూ ఎలా పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాక ఎలా కలిసి ఉన్నార‌న్న‌దే సినిమా క‌థ‌. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఇదే క‌థ‌ను కాస్త ఎమోష‌న‌ల్ గా చూపించాల‌నుకున్నాడు. కానీ అది వ‌ర్కౌట్ అవ్వ‌లేదు. సినిమాలో కొత్త‌ద‌నం ఏమీ లేదు. కానీ ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా సినిమాను న‌డిపించాడు. హీరో హీరోయిన్ మ‌ధ్య జ‌రిగే సన్నివేశాలు అల‌రిస్తాయి. ఇంట‌ర్‌వెల్ లో వ‌చ్చిన ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై మ‌రింత ఆస‌క్తి పెరుగుతుంది. అయితే సెకండ్ హాఫ్ మాత్రం అంత ఆస‌క్తిగా అనిపించ‌దు. సినిమా చూస్తున్న‌ప్పుడు కొన్ని సీన్ లు పాత సినిమాల‌ను గుర్తు తేవ‌డం మైన‌స్ గా అనిపిస్తుంది. ఇక సినిమాకు దేవీశ్రీ సంగీతం ప్ల‌స్ గా నిలిచింది. ఇంకాస్త ఎడిటింగ్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. నిర్మాణ విలువ‌లు సైతం భాగున్నాయి. 

న‌టీన‌టులు : సినిమాలో జులాయిగా తిరిగే అర్జున్ పాత్ర‌లో నితిన్ జీవించేశాడు. చిత్రంలోని ఎమోష‌న‌ల స‌న్నివేశాల్లో మ‌రియు కామెడీ స‌న్నివేశాల్లో న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. న‌చ్చ‌ని భార్య‌తో కాపురం చేస్తే ఎలా ఉంటుందో క‌ళ్ల‌కి క‌ట్టిన‌ట్టుగా చూపించాడు నితిన్. ఇక కీర్తి సురేష్ త‌న న‌ట‌న‌తో మ‌రోసారి మ‌హాన‌టి అనిపించుకుంది. ఎమెష‌న‌ల్ స‌న్నివేశాల‌ను అవ‌లీల‌గా చేసేసేంది. అల్ల‌రిపిల్ల‌గా ఆక‌ట్టుకుంది. అంతే కాకుండా అమాయ‌క‌పు చ‌క్ర‌వ‌ర్తిలా క‌నిపిస్తూనే నితిన్ ను ఇర‌కాటంలో పెడుతుంది. హీరోకి తండ్రి పాత్ర‌లో న‌రేష్ ఆక‌ట్టుకున్నారు. అంతే కాకుండా సినిమాలో కామెడిని పండించారు. మ‌రోవైపు హీరో ఫ్రెండ్స్ గా న‌టించిన సుహాస్ మ‌రియు అభిన‌వ్ గొమ‌టం త‌మ ప‌రిధి మేర‌కు న‌టించారు. సెంకండ్ హాఫ్ లో వ‌చ్చిన వెన్నెల కిషోర్ న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు.

రేటింగ్ : 3/5

More Related Stories