వైల్డ్‌ డాగ్ మూవీ రివ్యూ Wild Dog
2021-04-02 21:39:08

కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ గా ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరీ ఈ కథ ఎంత వరకు ప్రేక్షకులను మెప్పించింది.. అందులో నాగార్జున వైల్డ్ డాగ్‌గా ఎంత వరకు ఆకట్టుకున్నాడనేది ఓ సారి చూద్దాం.

క‌థ : విజయ్‌ వర్మ(నాగార్జున) ఉగ్రవాదులను అరెస్ట్‌ చేయడం కంటే అంతం చేయడమే ఉత్తమని భావిస్తాడు, అందుకే అంతా ‘వైల్డ్‌డాగ్‌’ అని పిలుస్తుంటారు.  జీవితంలో జ‌రిగిన ఓ విషాదం త‌ర్వాత నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీలో చేర‌తాడు. జాన్స్‌ బేకరిలో బాంబు బ్లాస్ట్‌ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఖలీద్‌ చేశాడని కనిపెడతారు.  ఖలీద్‌ని పట్టుకోవడానికి విజయ్‌ వర్మ అండ్  టీమ్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది ? విజయ్‌ వర్మ కి ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి?  పేలుళ్ల సూత్ర‌ధారి ఖలీద్‌ని ఎలా ఇండియాకి తీసుకొచ్చాడు? అనేదే మిగతా కథ.

కథనం:  నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమే ‘వైల్డ్ డాగ్’. ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ని  ఎంచుకుని, ఇప్పుడు సినిమాగా చేస్తున్నాడంటే ఇంకేవైనా కొత్త విష‌యాలు చెప్పారేమో, ఈ ఆప‌రేష‌న్ వెనుక ఎవ‌రికీ తెలియ‌ని సంగ‌తులేమైనా ఇందులో చూపించారేమో అనుకున్నారంతా.  కానీ, ద‌ర్శ‌కుడు పాత విష‌యాల్నే మ‌రోసారి గుర్తు చేశాడు త‌ప్ప కొత్త‌గా చెప్పింది తక్కువ. సెకండాఫ్‌ అంతా చాలా సీరియస్‌, ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో విజయ్‌ వర్మ చేసే కొన్ని విన్యాసాలు మాత్రం రొటీన్‌గా అనిపిస్తాయి. సినిమాలో ఎక్కువ భాగం ఇన్విస్టిగేషన్ సాగినా.. ఎక్కడా ఆసక్తిగా లేకపోవడం ఈ సినిమాకి మరో బలహీనత.

నటీనటులు: ఎన్‌ఐఏ అధికారి విజయ్‌ వర్మ పాత్రలో అదరగొట్టాడు నాగార్జున. దేశభక్తి గల అధికారిగా నాగార్జున జీవించేశాడు. ఆయ‌న పాత్రకి  బలమైన స‌న్నివేశాల్ని తీర్చిదిద్ద‌లేక‌పోయారు. రా ఏజెంట్‌ ఆర్యాపండిత్‌ పాత్రలో సయామీ ఖేర్‌ జీవించేసింది. ఛేజింగ్‌ యాక్షన్‌  సీక్వెన్స్‌లో నాగార్జునతో పోటీపడి మరీ ఇరగదీసింది. వైల్డ్‌డాగ్ టీమ్‌లో క‌నిపించిన న‌లుగురు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. దియామీర్జా పాత్ర‌కి ప్రాధాన్యం లేదు. 

టెక్నికల్ టీం: సాంకేతిక విభాగాల్లో షానీల్ డియో కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. యాక్షన్ సీక్వెన్స్ మలిచిన తీరు, తెరపై చూపించిన విధానం బాగుంది.తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సన్నివేశాలను ఎలివేట్ చేసేశాడు. కొన్ని సన్నివేశాలకు కత్తెర వేస్తే ఇంకాస్త బాగుండేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ విషయంలో ఎడిటర్ దృష్టి పెట్టాల్సింది. సోలోమన్ వైల్డ్ డాగ్‌ను అందరికీ కనెక్ట్ అయ్యేలా తీయడంతో విఫలమైనట్టు కనిపిస్తోంది. ఇన్వెస్టిగేషన్ అనే ఒకే పాయింట్ చుట్టూ కథను తిప్పడంతో మిగతా అంశాలన్నీ సైడ్ అయిపోయాయ్.

చివరగా: ‘వైల్డ్‌డాగ్’...కొంచెం ఆసక్తిగా !! 

రేటింగ్: 2.75/5. 

More Related Stories