కోపంతో అభిమాని ఫోన్ లాక్కొన్న హీరో అజిత్..Thala Ajith
2021-04-06 13:31:39

తమిళ హీరో అజిత్ అభిమానులతో చాలా ప్రేమగా ఉంటాడు. ఎక్కడ కనిపించినా కూడా ఆప్యాయంగా మాట్లాడుతాడు. వాళ్లకు కావాల్సినంత టైం ఇచ్చి సెల్ఫీలు కూడా దిగుతుంటాడు. అయితే ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా ఒకసారి వాళ్ళు చేసే పనులకు తమ టెంపర్ కోల్పోతుంటారు. ఇప్పుడు అజిత్ విషయంలో ఇదే జరిగింది. సాధారణంగా చాలా కామ్ గా కనిపించే హీరోకి ఇప్పుడు ఒక అభిమాని కోపం తెప్పించాడు. 

నేడు తమిళనాడులో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. దాంతో సినీ రాజకీయ ప్రముఖులు పోలింగ్ బూత్ లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే తన భార్య శాలినితో కలిసి అజిత్ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చాడు. ఒక సాధారణ వ్యక్తిలా జనంతో పాటు క్యూలో నిలబడ్డాడు. అసలే ఇప్పుడు కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో అజిత్ ఇలాంటి సూపర్ స్టార్ వచ్చి జనం మధ్యలో నిలబడితే ఇంకేమైనా ఉందా.. ఇప్పుడు ఇదే జరిగింది. 

ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన అజిత్ ను అభిమానులు ముప్పుతిప్పలు పెట్టారు. ఆయన వచ్చాడు అని తెలుసుకున్న తర్వాత పోలింగ్ బూత్ మొత్తం ఒక్కసారిగా రచ్చ రచ్చ అయిపోయింది. ఓటు వేయడానికి వచ్చామని సంగతి మర్చిపోయి తమ అభిమాన హీరోతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు అజిత్ అభిమానులు. ఈ క్రమంలో ఆయన తన సహనం కోల్పోయాడు. సెల్ఫీ కోసం వచ్చిన ఒక అభిమాని ఫోన్ లాక్కొని జేబులో పెట్టుకున్నాడు అజిత్. అంతేకాదు కాస్త ఆగ్రహించాడు కూడా. ఆ సంఘటనతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు వాళ్లకు వివరించి అభిమాని ఫోన్ మళ్ళీ తిరిగి ఇచ్చేసాడు అజిత్.

More Related Stories