వ‌కీల్ సాబ్ సినిమా రివ్యూ Vakeel Saab
2021-04-09 18:05:47

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ దాదాపు మూడేళ్ల త‌ర‌వాత రీఎంట్రీ ఇచ్చిన సినిమా వ‌కీల్ సాబ్.  ఈ చిత్రానికి ఓ మై ఫ్రెండ్, ఏంసీఏ సినిమాల ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్ తెర‌కెక్కించాడు. బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన సినిమా టీజ‌ర్ మ‌రియు ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల్లో ఎన్నో అంచనాల‌ను పెంచాయి. ముఖ్యంగా మూడేళ్ల త‌ర‌వాత ప‌వ‌న్ సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మ‌రి ఆ అంచనాల‌ను వకీల్ సాబ్ రీచ్ అయ్యాడా లేదా అన్న‌ది ఇప్పుడు చూద్దాం.

క‌థ : స‌త్య‌దేవ్ ప‌వ‌న్ కల్యాణ్ ప్ర‌జ‌ల కోసం ఏదైనా చేయాల‌ని త‌ప‌న‌ప‌డుతూ ‌సామాన్యులకు న్యాయం జ‌ర‌గాల‌ని లాయ‌ర్ వృత్తిని ఎంచుకుని లాయ‌ర్ గా స్థిర ప‌డతాడు.  అదే స‌మ‌యంలో శృతి హాస‌న్ ను పెళ్లి చేసుకుంటాడు. అయితే జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల త‌ర్వాత లాయ‌ర్ వృత్తిని వ‌దిలేస్తాడు. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ లోని ఓ ప్రాంతానికి వ‌చ్చి సెటిల్ అవుతాడు. అదే ప్రాంతంలో ఉండే అంజ‌లి,నివేధిత , అన‌న్య‌లు ఎంపీ కొడుకు మరియు బ్యాచ్ ను కొట్టి పారిపోయిన కేసులో ఇరుక్కుంటారు. కాగా నివేధిత పై ఎంపీ ప‌లు కేసులు పెట్టించి జైలు నుండి బ‌య‌ట‌కు రాకుండా చేస్తాడు. ఈ ఎఫైఆర్ ను చూసిన స‌త్యదేవ్ అంజ‌లికి కొన్ని సూచ‌న‌లు చేస్తాడు. స‌త్య‌దేవ్ నివేధిత వాళ్ల‌కు హెల్ప్ చేస్తున్న సంగ‌తి ఎంపీకి తెలియ‌డంతో స‌త్య‌దేవ్ ను బ‌య‌పెట్టాల‌ని అనుకుంటాడు. దాంతో ఈ కేసుకు స‌వాలుగా తీసుకుని స‌త్య‌దేవ్ టేక‌ప్ చేస్తాడు. ఇక కోర్టులో నంద ప్ర‌కాశ్ రాజ్ తో పోటా పోటీగా వాద‌న‌లు వినిపిస్తాడు. మ‌రి చివ‌రికి వ‌కీల్ సాబ్ త‌న క్లైయింట్ కు న్యాయం చేశాడా..అస‌లు ప‌వ‌న్ లాయ‌ర్ వృత్తిని ఎందుకు మ‌ధ్య‌లో వ‌దిలిపెట్టాడు. ముగ్గురు యువ‌తుల‌కు ఎంపీ కొడుకుతో ఎందుకు గొడ‌వ జ‌రిగింది అన్న‌దే ఈ సినిమా క‌థ‌. 

విశ్లేష‌ణ‌: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మూడేళ్ల త‌ర‌వాత వ‌కీల్ సాబ్ తో వ‌చ్చి విందు బోజ‌నం పెట్టాడు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న లోని కొత్త న‌టుడిని ప‌రిచ‌యం చేశాడు. లుక్స్ లోనూ ప‌వ‌న్ వింటేజ్ ఫీల్ ను క‌లిగించాడు. ఈ సినిమా మాస్ క్లాస్ ఆడియన్స్ అందర్నీ ఆక‌ట్టుకునేలా ఉంది. బాలీవుడ్ లో పింక్ సినిమాకేవ‌లం క్లాస్ ఆడియ‌న్స్ కు మాత్రమే క‌నెక్ట్ అవుతుంది. కానీ వ‌కీల్ సాబ్ అన్ని ర‌కాల ఆడియ‌న్స్ ను మెప్పిస్తుంది. ఇక కోర్టులో అయితే విజిల్ కొట్టే స‌న్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఈ సినిమాను చూడాలా వ‌ద్దా అని డౌట్ పెట్టుకోవాల్సిన అవ‌స‌రం అస్స‌లు లేదు. ఇది పక్కా ప‌వ‌ర్ ప్యాక్డ్ మూవీ కాబ‌ట్టి క‌చ్చితంగా చూడ‌వ‌చ్చు.

న‌టీన‌టుల ప‌ర్ఫామెన్స్: ఈ సినిమాలో మునుపెన్న‌డూ చూడ‌ని విధంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌ట‌న ఉంద‌ని చెప్పొచ్చు. ఈ సినిమాలో ప‌వ‌న్ డిఫ‌రెంట్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ను స‌ర్పైజ్ చేశారు. పీక్స్ లెవ‌ల్ లో ప‌వ‌న్ త‌న ప‌ర్ఫామెన్స్ ను క‌న‌బ‌రిచారు. సినిమాలో ఎమోష‌నల్ సీన్ల‌లోనే కాకుండా మ‌ధ్య‌లో సెట్లైర్లు వేయ‌డం..కోర్టు స‌న్నివేశాలు.. కాలేజీ స‌న్నివేశాల‌ల్లో పవ‌న్ అద్భుతంగా న‌టించారు. ఇక సినిమాకు నివేదిత ఎమోష‌నల్ సీన్స్ ప్రాణం పోశాయి. అంజ‌లి కోర్టు సీన్లో అద‌ర‌గొడుతుంది కానీ ఆ త‌ర‌వాత ఆమెకు పెద్ద‌గా స్కోప్ ఉండ‌దు. ఇక అన‌న్య త‌న పాత్ర‌మేర న‌టించిన ఆమెను హైలెట్ చేసే సీన్స్ లేక‌పోవ‌డంతో టాలెంట్ ను నిరూపించ‌కునే అవ‌కాశం ద‌క్క‌లేదు. ఇక ప్ర‌కాశ్ రాజ్ యాజ్ ఇట్ ఈస్ గా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు.

టెక్నిక‌ల్ టీం: అభిమాన ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకు సంగీతాన్ని ఇవ్వాల‌న్న త‌మ‌న్ క‌ల ఈ సినిమాతో నెర‌వేరింది. అంతేకాకుండా వ‌చ్చిన అవకాశాన్ని త‌మన్ స‌ద్వినియోగం చేసుకున్నాడు. ఈ సినిమాలోపాటలు సూప‌ర్ హిట్ గా నిలిచిన సంగ‌తి సినిమా విడుద‌లకు ముందే తెలిసిన విష‌యం. అయితే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను త‌మ‌న్ అంత‌కంటే బాగా ఇచ్చారు. ముఖ్యంగా కోర్టు సీన్ల‌లో త‌మన్ మ్యూజిక్ సూప‌ర్ అనే చెప్పాలి. పి ఎస్ వినోద్ కుమార్ విజువ‌ల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా మూడు పాత్ర‌లో ప‌వ‌న్ ను డిఫ‌రెంట్ లుక్ లో చ‌క్క‌గా చూపించాడు. ప‌వ‌న్ పూడి ఎటింగ్ బాగుంది. దిల్ రాజు..బోణీ క‌పూర్ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

రేటింగ్ : 3.5/5 

More Related Stories