తారక్ కొరటాల సినిమాలో బాలీవుడ్ హీరోయిన్Jr NTR
2021-04-17 18:11:17

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇక ఇప్ప‌టికే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కొర‌టాల ద‌ర్శకత్వంలో ఉండ‌బోతుంద‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్కించ‌బోతున్నారు. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ మిక్కిలినేని సుదాకర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించ‌బోతున్నారు. ఇక ఇప్ప‌టికే కొర‌టాల శివ ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్ హిట్ గా నిలిచింది. దాంతో ఎన్టీఆర్ కొర‌టాల కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రావ‌డంపై అభిమానులు ఫుల్ కుషీగా ఉన్నారు. 

అయితే  తాజాగా ఈ సినిమా పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమా ఎన్టీఆర్ స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్ లు న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఇద్ద‌రిలో ఒక‌రు బాలీవుడ్ హీరోయిన్ కూడా ఉన్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం హీరోయిన్ లను సెట్ చేసే ప‌నిలో కొర‌టాల ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సినిమాలో ఎన్టీఆర్ ప‌ల్లెటూరు నుండి వ‌చ్చిన కుర్రాడిలా ఎన్టీఆర్ క‌నిపించ‌బోతున్నార‌ట‌. ప‌ల్లె టూరి నుండి న‌గ‌రానికి వ‌చ్చి ఎన్నో ఇబ్బందులు ఎదురుకునే పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపిస్తార‌ట‌. ఇక ప్ర‌స్తుతం కొర‌టాల మెగాస్టార్ హీరోగా ఆచార్య సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమాను పూర్తి చేసిన వెంట‌నే ఎన్టీఆర్ తో సినిమా ప‌ట్టాలెక్కుతుంది. ‌

More Related Stories