అందాల దివికి అరుదైన గౌరవం Divi Vadthya
2021-05-31 14:50:41

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటినటుల్లో దివి వాద్య ఒకరు. దివి బిగ్ బాస్ కంటే ముందు సినిమాల్లో ఫ్రెండ్ రోల్స్ చేసేది. అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేవరకు అసలు దివి అంటేనే ప్రేక్షకులకు పరిచయం లేదు. కానీ హౌస్ లోకి వచ్చాక ఆమె పొడవాటి సౌందర్యానికి...చేప లాంటి కండ్లకి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ షో నుండి భయటకు వచ్చాక దివి అటు టీవీ షోలలో ఇటు వెబ్ సిరీస్ లలో సందడి చేస్తోంది..మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అందచందాలతో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది. అలా వెలిగిపోతున్న దివికి తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ టైమ్స్ లో 2020 మోస్ట్ డిజైరబుల్ టీవీ నటి గా దివి గుర్తింపు తెచ్చుకుంది.  మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా తాను నిలవడం నమ్మలేకపోతున్నానని చాలా సంతోషంగా ఉన్నానని దివి ఈ సందర్భంగా వెల్లడించింది. ఇదిలా ఉండగా దివి ఇటీవలే క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అంతే కాకుండా మెగాస్టార్ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.

More Related Stories