ఆహా కోసం రంగంలోకి హరీష్ శంకర్ సినిమా Harish shankar
2021-06-13 12:02:34

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ అప్పట్లో హరీష్ శంకర్ డిజిటల్ ప్లాట్ ఫాం "ఆహా"  కోసం ఒక సినిమా చేస్తారని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టు పై మళ్లీ ఎలాంటి  అప్డేట్ రాలేదు. కాగా తాజాగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. హరీష్శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం గాని కథను ఇవ్వడం గానీ చేయట్లేదు. ఈ సినిమాకు హరీష్ శంకర్ కేవలం నిర్మాతగా వ్యవహరిస్తారు. 

అంతే కాకుండా ఈ చిత్రానికి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా, గ్రీకువీరుడు సినిమాల దర్శకుడు దశరథ్ కథను అందిస్తున్నారు. ఇక దర్శకత్వం విషయానికి వస్తే ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ  సినిమా అహాలో రాబోతోంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెలువడబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇదిలా ఉండగా హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోగానే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. ఇదిలా ఉండగా ఓ వైపు నిర్మాతగా మరోవైపు దర్శకుడిగా హరీష్ శంకర్ ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి.

More Related Stories