క‌లెక్ష‌న్ కింగ్ పాట‌పై ప‌రుచూరి ప్ర‌శంస‌లుParuchuri Gopala krishna
2021-06-17 14:39:29

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ప్ర‌స్తుతం స‌న్ ఆఫ్ ఇండియా అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు డైమండ్ రత్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అంతే కాకుండా మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్ ను విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్ కు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డం హైలెట్ గా నిలిచింది. అంతే కాకుండా ఈ సినిమా నుండి విడుద‌ల చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్  జయ జయ మహా వీర కు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. 

ఇక తాజాగా ఈ పాట‌పై ప్ర‌ముఖ ర‌చయిత ప‌రుచూరి గోపాల కృష్ణ ప్ర‌శంస‌లు కురింపించారు. పరుచూరి మాటల్లో సన్ ఆఫ్ ఇండియా లిరికల్ వీడియో చూశాను. 11వ శతాబ్దంలో అలరించిన రఘువీరా గద్యాన్ని 21వ శతాబ్దంలో దృశ్యాత్మకంగా చూడగలిగే అదృష్టాన్ని అందించిన మోహన్ బాబుకి, ప్రొడ్యూసర్ విష్ణుకి ధన్యవాదాలు. మోహన్ బాబు మ‌ళ్లీ తాను ఎవర్ గ్రీన్ అని నిరూపించుకున్నాడు .అంటూ ప‌రుచూరి ప్ర‌శంస‌లు కురింపించారు. ఇదిలా ఉండ‌గా ఈ పాట జయ జయ మహా వీర అనే పదాలతో మొదలవుతుంది. ఈ పాటను రాహుల్ నంబియార్ పాడగా.... మాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. 

More Related Stories