పెళ్లికి ముందే గర్భం దాల్చిన హీరోయిన్Freida Pinto
2021-06-30 08:02:30

ప్రస్తుతం డేటింగ్ అనేది కామన్ అయిపోయింది. పెళ్లికి ముందే సహజీవనం చేసి ఆ సమయంలో వారి ఇద్దరి మధ్య అన్యోన్యతను బట్టి కలిసి ఉండాలా విడిపోవాలనే స్వేచ్ఛ వారికి ఉంటుంది. ఒకవేళ కలిసి ఉందాం అనుకున్నప్పుడు మాత్రమే ఆ జంట పెళ్లి పీటల వరకు వెళుతుంది. కానీ తేడా వస్తే మధ్యలోనే విడిపోతున్నారు. ఇక కొంతమంది డేటింగ్ చేస్తున్న సమయంలో పిల్లలను కూడా కనేస్తున్నారు. అలాగే ఓ సెలబ్రిటీ జంట సహజీవనం చేస్తున్న సమయంలోనే హీరోయిన్ గర్భం దాల్చింది. 

స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమా తో హీరోయిన్ గా పరిచయమైన ఫ్రీదా పింటో పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా జనాలతో పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె తన ప్రియుడు కోరి ట్రాన్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఫ్రీదా పింటో, కోరి ట్రాన్ 2017 నుంచి డేటింగ్ లో ఉన్నారు. కొంతకాలం క్రితం తాము ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నామని ప్రకటించారు .కానీ ఇప్పటివరకు పెళ్లి ప్రకటన రాలేదు. ఆమె గర్భవతి అని తెలియడంతో స్నేహితులు ,సన్నిహితులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ హీరోయిన్ ప్రస్తుతం బ్రిటన్స్‌ వరల్డ్ వార్ 2, స్పై ప్రిన్సెస్‌, దా ది లైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్ చిత్రాల్లో నటిస్తోంది. అంతే కాకుండా స్పై ప్రిన్సెస్‌ సినిమాకి కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది.

More Related Stories