స‌భ‌కు న‌మ‌స్కారం అంటున్న అల్ల‌రి హీరోAllari Naresh
2021-06-30 23:33:54

కామెడీ సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లరి నరేష్. కేవలం కామెడీ సినిమాలు మాత్రమే కాకుండా గమ్యం, నాంది లాంటి సినిమాలతో తనలో ఉన్న వైవిధ్యమైన నటుడిని కూడా జనాలకు పరిచయం చేశాడు. హీరోగా చాలా ఏళ్లుగా హిట్ లేకుండా కెరీర్ నడుపుతున్న హీరోకు ఈ ఏడాది విడుదలైన  'నాంది' మంచి కం బ్యాక్ ఫిలిం గా నిలిచింది. ఈ సినిమా విజయం తరువాత హీరో వరుస పెట్టి సినిమాలు చేస్తాడేమో అనుకున్నారు కానీ ఆచితూచి అడుగులు వేద్దామని నరేష్ అనుకున్నట్టుగా తెలుస్తుంది. 

అందులో భాగంగానే కరోనా తగ్గుముఖం పట్టి సినిమా షూటింగు లు ప్రారంభం అవడంతో నరేష్ పుట్టినరోజు సందర్భంగా తన 58వ సినిమా వివరాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ఈ సినిమాకు 'సభకు నమస్కారం' అనే పేరును ఖరారు చేశారు. సతీష్ మల్లెపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తున్నాడు. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పేరుమీద  మహేష్ ఎస్ కోనేరు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది .ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More Related Stories