నటి క‌విత ఇంట మ‌రో విషాదంActress Kavitha
2021-07-01 00:15:08

కరోనా వల్ల ఎంతోమంది తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలారు. మరికొంతమంది తమకు కావాల్సిన  వ్యక్తులను కోల్పోయి పుట్టెడు శోకంలో బతుకుతున్నారు. ఇలా ఎన్నో చోట్ల జరిగినవి వార్తల్లోకి రాకపోవచ్చు కానీ, మనందరికీ తెలిసిన సినీ నటి జీవితం లో కూడా కరోనా దుఃఖాన్ని మిగిల్చింది. వివ‌రాల్లోకి వెళితే.... తెలుగు సినిమాల్లో అమ్మగా ,అత్తగా మరెన్నో విలక్షణమైన పాత్రల్లో నటించిన సీనియ‌ర్ న‌టి కవిత ,తనయుడు కరోనాతో గత కొద్ది కాలం క్రితమే మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే సమయంలో ఆమె భర్త కూడా కరోనాతో స్వాస సంబంధిత‌ ఇబ్బందులను ఎదుర్కొంటూ హాస్పటల్ లోనే చేరారు. ఆయితే ఆయ‌న త్వ‌ర‌లోనే కోలుకుంటార‌ని అంతా భావించారు. కానీ ఆయ‌న కూడా క‌న్ను మూశారు. ఈ సంఘటనతో కవిత గారు తీవ్రమైన మనస్థాపానికి గురయ్యారు. కేవలం కొంతకాలం వ్యవధిలోనే కుమారుడు ,భర్త చనిపోవడాన్ని ఆమె జీర్ణించు కోలేకపోతున్నారు. ఈ సంఘటన పట్ల ఇండస్ట్రీలోని ప‌లువురు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు చేశారు. క‌విత‌కు ధైర్యం చెబుతున్నారు. 

More Related Stories