రాధే శ్యామ్ ను పూర్తిచేసిన బుట్ట‌బొమ్మ‌ Pooja Hegde
2021-07-01 20:50:15

డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రాదే శ్యాం' దీనికి 'జిల్' పెమ్ రాధాకృష్ణ దర్శకత్వం వాయిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇది పునర్జన్మల నేపథ్యంలో ఇటలీ బ్యాక్ డ్రాప్ లో జరిగే ప్రేమ కథ. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినా కూడా కొన్ని  సీన్ల ఈ విషయంలో చిత్ర బృందం అసంతృప్తి గా ఉండడం వలన తిరిగి  రీ షూట్ చేయాలని అనుకుంది కానీ కరోనా వల్ల అది కుదరలేదు, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల పదిరోజుల షెడ్యూల్ ను ఏర్పాటు చేశారు. 

దానిలో భాగంగా మొదట హీరోయిన్ పూజా హెగ్డే కు సంబంధించిన సీన్లను తీశారు దానితో ఈ ముద్దుగుమ్మ 'రాధే శ్యాం' టీం కి గుడ్ బై చెప్పేసింది. ఇక ప్రభాస్ ,ఇతర నటీనటుల కు సంబంధించిన సన్నివేశాలను తీసి నట్లయితే సినిమా పూర్తి అయినట్టే. ఇందులో లో ప్రతి సీన్ ని అద్భుతంగా తీయడానికి దర్శకుడు చాలా కష్టపడుతున్నటు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక టీజర్ ని విడుదల చేశారు దీనికి జనాల నుండి మంచి ప్రజాదరణ దక్కింది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి యువి క్రియేషన్స్ ,టి సిరీస్ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టారు.

More Related Stories