నిర్మాణ రంగంలోకి తాప్సీ.. అసలు కారణం ఇదే Taapsee Pannu
2021-07-17 18:21:40

'ఝుమ్మందినాధం' సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన తాప్సీ పన్నూ, వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో, తన పాత్ర కు ప్రాధాన్యత వున్న సినిమాల్లో నటిస్తూ వరుస విజయాలను తన బ్యాగులో వేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా పదేళ్లు గడిచాక ఇప్పుడు ‘అవుట్ సైడర్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా మారింది. తాప్సీ పీక్ లో వున్న సమయంలో నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే దానికి విశ్లేషకులు తమదైన బాణీలో సమాధానాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీలు కంటెంట్ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో తాప్సీ వరుస విజయాలతో ముందుకు పోతోంది.

తాప్సీ కి అన్ని భాషల్లో వున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని జీ స్టూడియోస్ ఆమెతో కలిసి సినిమాలు నిర్మించడానికి ముందుకొచ్చింది. ఆ అవకాశాన్ని  తాప్సీ అందిపుచ్చుకుంది. వాళ్లతో కలిసి నిర్మాణంలో భాగస్వామి అయ్యిందని విశ్లేషిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ, ‘సూపర్, 30,83 సూర్మ, పికూ ముబాకరన్’ చిత్రాలను నిర్మించిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రచయిత ప్రంజల్ ఖంద్ దియాతో కలిసి తాస్పీ సినిమాలు నిర్మించడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

ఈ నిర్మాణ సంస్థలో అజయ్ భాల్ దర్శకత్వంలో ‘బ్లర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు ప్రంజల్ ఖంద్ దియాలతో కలిసి తాప్సీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2022 లో విడుదల కానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.తాప్సీ డెడికేషన్ ను చూసిన వాళ్లు మాత్రం తాప్సీ నిర్మాత గా కూడా సక్సెస్ సాధిస్తుంది అని చెబుతున్నారు.

More Related Stories