తమిళ హీరోలు మనవైపు… మన వాళ్లు పాన్ ఇండియా వైపు Tamil actors
2021-07-17 18:35:03

ఓటీటీలు తెర మీదికి వచ్చాక సినిమా ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం నిర్మాతలు అన్ని భాషల్లో తెలిసిన నటీనటులు ఎవరున్నారా? అంటూ వెదుకుతున్నారు. అంతేకాదు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చదివిన విద్యార్థులకు డిమాండ్ పెరుగుతోంది. సివిల్ ఇంజనీర్ ప్లాన్ గీస్తాడు, మెడిసెన్ చదివిన వాళ్లు డాక్టర్లు అవుతారు అన్నట్టు స్కూల్ ఆఫ్ డ్రామాలో చదువుకున్న వాళ్లకు ప్రిఫరెన్స్ వుంటోంది అంటూ ఓ బాలీవుడ్ విశ్లేషకుడు చెప్పారు. సాధారణంగా బాలీవుడ్ సినిమాలను దక్షిణాదిన చూడటం చాలా తక్కువ. కానీ ఓటీటీ పుణ్యమా అని బాలీవుడ్ లో రూపొందించిన వెబ్ సీరిస్ లు, సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద కనిపిస్తున్నాయి.

ఈ లాక్ డౌన్ లో దక్షిణాది ప్రేక్షకులు అన్ని వెబ్ సీరిస్ లు, సినిమాలు చూడటం వల్ల బాలీవుడ్ నటులు దక్షిణాది ప్రేక్షకులకు సుపరిచితం అవుతున్నారు. అలాగే ఇక్కడి మంచి సినిమాలు బాలీవుడ్ లోకి డబ్ చేయడం వల్ల మన హీరోలు కూడా బాలీవుడ్ లో పాగా వేస్తున్నారు. దీంతో ఉత్తరాది, దక్షిణాది అనే ఎల్లలు దాదాపు తగ్గి పోతున్నాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు. బాహుబలి, సాహో లాంటి సినిమాలు తెలుగును ఉన్నత స్థాయిలో చేర్చాయి. అలాగే ఇప్పుడు తెలుగులో నిర్మితమవుతున్న భారీ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలే. ఇది మంచి పరిణామం.

మన హీరోలు కూడా అన్ని భాషల్లోకి పరిచయం అవుతారు.ఇక పోతే తమిళ హీరోలు మొదట్నుంచి తెలుగు సినిమా పరిశ్రమ పైనే కన్నేశారు. రజనీకాంత్, సూర్య, కార్తి, అజిత్, ధనుష్, తదితర హీరోలకు అక్కడ ఇక్కడ సేమ్ బిజినెస్ వుంది. ప్రస్తుతం శివకార్తికేయకు దాదాపు 20 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి ఓ తెలుగు నిర్మాతలు సినిమా నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మిగతా వివరాలు తెలియాల్సి వుంది. ఒక తెలుగు దర్శకుడైన శేఖర్ కమ్ముల మొట్ట మొదటి సారి తమిళ హీరో అయిన ధనుష్ హీరోగా సినిమాను రూపొందించడం కాస్త శుభపరిణామం.

More Related Stories