రాశీఖన్నాతో రాజ్ డీకే. ఇంతకీ ప్లాన్ ఏంటి.. Raashi khanna
2021-07-17 18:49:13

రాశీ ఖన్నా ప్రస్తుతం నాగచైతన్య సరసన థ్యాంక్యూ, గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’ చిత్రాల్లో నటిస్తూ,. తెలుగులో కావలసినంత పేరు సంపాదించుకుంది రాశీ ఖన్నా. ఇప్పుడు ఫ్యామిలీమ్యాన్ సీరిస్ తో దేశ ప్రజలందరిని తన వైపు తిప్పుకున్న రాజ్ డీకే తమ తదుపరి వెబ్ సీరియస్ కోసం వెదుకుతున్న వలలో రాశీ ఖన్నా చిక్కి, అదృష్టం సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. రాజ్ డీకే తదుపరి నిర్మిస్తున్న వెబ్ సీరియస్ లో షాహిద్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అందులో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల ప్యామిలీ మ్యాన్ సీరిస్ 2లో సమంత నటన చూసి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. మరి అంతే రేంజ్ లో రాశీ ఖన్నా కూడా పేరు సొంతం చేసుకుంటుందా? అనేది వేచి చూడాలి.

ఇక రాజ్ డీకే విషయానికి వస్తే.. ఫ్యామిలీ మ్యాన్ సీరిస్ తో దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల వారు నిర్మించిన సినిమా బండి సినిమా కూడా విశేష ఆదరణ పొందింది. దీంతో రాజ్ డీకే పైన ఓటీటీలకు విపరీతమైన నమ్మకం ఏర్పడింది. ఫ్యామిలీ మ్యాన్  సీరిస్ 1 కంటే సీరీస్ 2 కు మేకింగ్ పరంగా ఎంతో పరిణతి సాధించారని ఈ క్రమంలో రాశీఖన్నా అందనంత ఎత్తుకు వెళ్లే ఛాన్సెస్ వున్నాయని పలువురు  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా సురేష్ వంగ దర్శకత్వంలో కూడా రాశిఖన్నా ఓ వెబ్ సీరిస్ లో నటిస్తోందని, క్రైమ్ యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సీరీస్ లో రాశి ఓ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోందని తెలిసింది. ఏదేమైనా రాశి వెబ్ సీరిస్ లో కూడా నటించి దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకోవాలని ఆశిద్దాం.
 

More Related Stories