గుర్తుందా శీతాకాలం గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్Gurthunda Seethakalam
2021-07-17 19:13:41

విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకెళుతున్నాడు సత్యదేవ్. ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం’ అనే విబిన్న ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. కన్నడలో విజయం సాధించిన ‘లవ్ మాక్ టైల్’ మూవీకి రీమేక్ ఇది. ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే నిర్మాత కూడా. యువ సంగీత దర్శకుడు కాల భైరవ సంగీత అందిస్తున్నారు. ఇందులో సత్యదేవ్ సరసన మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తుంది.

అయితే.. ఈ చిత్రంలో తమన్నా కేన్సర్ పేషంట్ గా కనిపించనుందని… అందుకోసం ఇండియాలో పాస్టటిక్ మేకప్ లో ఫేమస్  అయిన రోషన్ ఈ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్ మేకప్ చేశారని తెలిసింది. ఇందులో తమన్నాను కేన్సర్ పేషంట్ గా ఢిఫరెంట్ మేకప్ తో చూపించనున్నట్టు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇది చూసి సినిమా చూస్తున్న ప్రేక్షకులు థ్రిల్ కు గురవుతారు అంటున్నారు. అయితే.. మిల్కీ బ్యూటీని ఒక గ్లామర్ డాల్ గానే అభిమానించి తమన్నా అభిమానులు మరి కేన్సర్ పేషంట్ గా ఆదరిస్తారా? అనేది ఇక్కడ పాయింట్ అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి.. మిల్కీబ్యూటీ తమన్నా చేస్తున్న ఈ డిఫరెంట్ రోల్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

More Related Stories