పూరి లైగర్ ఆలస్యానికి కారణం puri jagannadh
2021-07-17 19:32:10

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ లైగర్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఈ భారీ చిత్రాన్ని పూరి, చార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముంబాయిలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే.. కరోనా కారణంగా షూటింగ్ ఆగింది. హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పటి వరకు లైగర్ తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయలేదు.

చాలా స్పీడుగా షూటింగ్ పూర్తి చేసే పూరి.. లాక్ డౌన్ తర్వాత ఇంకా లైగర్ షూటింగ్ ను స్టార్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి..? ఇంతకీ లైగర్ లేటెస్ట్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు..? లైగర్ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారు.? అని అటు పూరి అభిమానులు ఇటు విజయ్ దేవరకొండ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. పూరి లోకేషన్స్ చూడడం కోసం విదేశాలకు వెళ్లారని.. అక్కడ భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించాల్సివుందని తెలిసింది. సెప్టెంబర్ నుంచి విదేశాల్లో తాజా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని టాక్. షూటింగ్ పూర్తైన తర్వాత విడుదలపై క్లారిటీ వస్తుంది.
 

More Related Stories