బప్పీలహరి సంగీతంతో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు భారీ చిత్రంBappi-lahiri to give-music to chadalawada-brothers new movie
2021-08-28 06:07:47

డిస్కోకింగ్ బప్పీలహరి వయసు మీద పడుతున్నా తన  ప్రత్యేక డిస్కో వినసొంపు భాణీలతో తన సంగీతానికి మరింత పదును పెడుతూ సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నారు. చదలవాడ తిరుపతిరావు ఆయన సోదరుడు చదలవాడ శ్రీనివాసరావు తాజాగా నిర్మించబోయే ఓ భారీ యాక్షన్ చిత్రానికి బప్పీలహరి సంగీతం సమకూర్చబోతున్నట్లు  ఆ చిత్ర దర్శకుడు జి. రవికుమార్ మీడియాకు తెలియజేశారు. చదలవాడ బ్రదర్స్ నిర్మించిన " రోజ్  గార్డెన్" చిత్రం ద్వారా హీరోగా  పరిచయమవుతున్న నితిన్ నాష్ ఈ నూతన చిత్రంలో కూడా హీరో గా నటించనున్నారు.

"రోజ్ గార్డెన్" సంగీతంతో కూడిన ప్రేమ కథాచిత్రం అయినప్పటికీ ఆ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల్లో సాహసవంతంగా ఫైట్లు అదరగొట్టిన హీరో నితిన్ నాష్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ... ఈ కుర్రాడు యాక్షన్ హీరోగా రాణించగలడనే పూర్తి నమ్మకంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు  చదలవాడ తిరుపతిరావు వెల్లడించారు. ఈ సందర్భంగా  చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..."శ్రీలంక, దుబాయ్, ఈజిప్ట్, మలేసియా దేశాల్లో షూటింగ్ జరుపుకునే ఈ తాజా చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాం. అలాగే ఇతర నటీనటులు, సాంకేతికనిపుణుల ఎంపిక జరుగుతోంది. హాలీవుడ్ కి చెందిన యాక్షన్ కొరియోగ్రాఫర్లను కూడా సంప్రదిస్తున్నాం" అని చెప్పారు.

 కాశ్మీర్ లో భారీ ఎత్తున హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన " రోజ్  గార్డెన్" చిత్రం. ప్రస్తుతం  ప్రసాద్ ల్యాబ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. డాల్బీ మిక్సింగ్, డి ఐ పనుల దశలో ఉన్న ఈ చిత్రాన్ని నిర్మాతలు అతి త్వరలో ప్రపంచం అంతటా విడుదల చేయబోతున్నారు.

More Related Stories