మా అధ్యక్ష బరిలో సివిఎల్ నరసింహరావు.. మేనిఫెస్టో విడుదలc-v-l-narasimha-rao-released-his-manifesto-for-maa-elections-2021
2021-09-16 22:45:58

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల గురించి రోజుకో వార్త బయటకు వస్తుండడంతో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాష్‌ రాజ్, మంచు విష్ణు నువ్వా నేనా..? అన్నట్టుగా పోటీపడుతున్నారు. దీంతో ఎవరు మా అధ్యక్ష కిరీటాన్ని సొంతం చేసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది. అయితే.. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తామన్న జీవిత, హేమ ప్రకాష్ రాజ్ ప్యానల్ లో చేరడం.. ఆయన ప్యానల్ తరుపున పోటీ చేస్తుండడం తెలిసిందే. ఇప్పుడు సీనియర్ యాక్టర్ సివిఎల్ నరసింహరావు మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టుగా మరోసారి ప్రకటించారు. ఈ రోజు ఆయన తన మేనిఫెస్టో ప్రకటించారు.

ఈ సందర్భంగా సివిఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో నేను కూడా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్నాను ఈ విషయం అందరికీ తెలుసు. ఈ వేళ నా మేనిఫెస్టోని ప్రకటిస్తున్నాను. మేనిఫెస్టో అంటే పెద్దగా కొత్త విషయాలు అంటూఏమీ లేవు. పది సంవత్సరాల క్రితం మా సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా పరిశ్రమలో ఉన్న అన్ని విభాగాలతో విపులంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇది 2011లో జరిగింది. అప్పుడు మురళీమోహన్ గారు అధ్యక్షుడుగా ఉన్నారు. ఆ నిర్ణయాలను యధాతధంగా అమలు చేయడమే తక్షణ కర్తవ్యం. కారణం ఏంటంటే.. ఇప్పుడు ఎవరైతే వచ్చి సంక్షేమం గురించి అది చేస్తాం ఇది చేస్తామంటున్నారో.. వాళ్లకు తెలియనది ఏంటంటే.. వీటి గురించి అప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది.

రెండో విషయం ఏంటంటే.. ఆడపిల్లలకు రక్షణగా ఆసరా అనే ఆర్గనైజేషన్ స్ధాపించడం జరిగింది. దీనికి జయసుధ చైర్ ఫర్సన్ గా ఉండేవారు. రెండేళ్ల పాటు అప్పడు వర్క్ చేశారు. ఇప్పుడు ఆ ఆసరాను మళ్లీ యాక్టీవేట్ చేస్తాం. మరో విషయం ఏంటంటే.. తెలంగాణకు సంబంధించిన డా.ప్రభాకర్ రెడ్డి, కాంతారావు, పైడి జై రాజ్.. ఈ ముగ్గురు కూడా నటులు.. అని మా ద్వారా గుర్తుచేయడం తక్షణ కర్తవ్యం. వచ్చే తరం వాళ్లు అసలు ఆ ముగ్గురు నటులుగా ఉన్నారా అని మరచిపోయే అవకాశం ఉంది. ఎఫ్ఎన్ సిసి పెద్ద 5 స్టార్ హోటల్ లాంటిది. అందులో 85 శాతం మా సభ్యులకు సభ్యత్వం లేదు. కారణం ఏంటంటే.. అందులో సభ్యత్వం తీసుకోవాలంటే.. పెద్ద మొత్తం కట్టాలి.
 
అందుచేత మా సభ్యులకు అందులో సభ్యత్వం వచ్చేలా చూడడం. మా సభ్యత్వం తీసుకోవాలంటే పెద్ద మొత్తంలో కట్టాల్సిన అమౌంట్ కట్టలేక కొంత మంది తెలంగాణకు సంబంధించిన నటులు సభ్యత్వం తీసుకోలేదు. వాళ్లకు సభ్యత్వం వచ్చేలా చూడడం. ఇక ఓటీంగ్ విషయంలో బ్యాలెట్ ఓటింగ్ తో పాటు ఆన్ లైన్ ఓటింగ్ కూడా పెట్టడానికి ప్రయత్నించడం. విదేశాల్లో ఈవెంట్లు చేసేటప్పుడు ఎప్పుడు విదేశాలకు వెళ్లని నటీనటులకు అవకాశం ఇవ్వడం.. చిన్న సినిమాల రిలీజ్ టైమ్ లో ప్రమోషన్స్ కు సపోర్ట్ చేయడం.. మా సభ్యులు అందరూ ఆత్మగౌరవంతో బతికేలా చూడడం.. తన మేనిఫెస్టో అని తెలియచేశారు సివిఎల్ నరసింహారావు.

More Related Stories