లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానున్న చిరు, నాగ్.chiru and nag to grace love story event
2021-09-16 23:00:33

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ విభిన్న ప్రేమకథా చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రచారం మళ్ళీ ఊపందుకొంది. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. దాంతో, మళ్లీ అగ్రెస్సివ్ గా ప్రొమోషన్లు మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా కింగ్ అతిథిలు రానున్నారు. ఈ నెల 20న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున మెయిన్ గెస్టులు. సాధారణంగా నాగ చైతన్య సినిమాలకు నాగార్జున అతిథిగా వస్తుంటారు. ఈసారి చిరంజీవి కూడా రానుండడం విశేషం.

ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. పాటలన్నీ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల తీస్తున్న మూవీ కావడంతో అందరి చూపులు దీని పైనే ఉన్నాయి. రెండో వేవ్ తర్వాత సినిమాల థియేటర్లకు జనాలు పెద్ద ఎత్తున రావడం లేదు. ఇప్పటివరకు సాలిడ్ హిట్ లేదు. ‘లవ్ స్టోరీ’ మళ్ళీ జనాలను థియేటర్లకు రప్పిస్తుందనే నమ్మకంతో ఉంది ట్రేడ్. మరి.. లవ్ స్టోరీ ఏ రేంజ్ సక్సస్ సాధిస్తుందో చూడాలి.

More Related Stories