బన్నీ, బోయపాటి కాంబినేషన్ సెట్ అయ్యిందా.?will Bunny and boyapati srinu combination repeat again
2021-09-17 06:09:19

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నారు. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న పుష్ప ప్రస్తుతం కాకినాడ సమీపంలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇది అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది. ఈ పాన్ ఇండియా మూవీని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్.. ఐకాన్ మూవీ చేయనున్నారు. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. దసరాకి ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ క్రేజీ మూవీని 2022 ద్వితీయార్ధంలో విడుదల చేయాలి అనేది ప్లాన్. ఇదిలా ఉంటే… అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్ సక్సస్ సాధించింది. దీంతో ఈ మూవీ తర్వాత మరోసారి బన్నీ, బోయపాటి కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. ఆమధ్య వీరిద్దరి మధ్య కథాచర్చలు జరిగినట్టు వార్తలు వచ్చాయి కానీ.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ లేదు అని టాక్ వినిపించింది. అందుకనే బోయపాటి సూర్యతో మూవీ ప్లాన్ చేస్తున్నారని ఓసారి కాదు కాదు.. కేజీఎఫ్ హీరో యష్ తో ప్లాన్ చేస్తున్నాడని మరోసారి వార్తలు వచ్చాయి.

అయితే.. తాజా అప్ డేట్ ఏంటంటే.. బన్నీ బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. జనవరిలో ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుందని తెలిసింది. అందుకనే బోయపాటి సూర్య, యస్ సినిమాలను పక్కనపెట్టి ఈ సినిమాని చేయాలి అనుకుంటున్నారట. ఈ భారీ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించనున్నారు. సరైనోడు సినిమాలో ఊర మాస్ గా చూపించిన బోయపాటి ఈసారి బన్నీని ఇంకెంత మాస్ గా చూపించనున్నారో..?.

More Related Stories