లవ్ స్టోరీ రివ్యూLove story Review
2021-09-24 22:20:30

యువ సమ్రాట్ అక్కినేని నాగచైతన్య, ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం.. ముఖ్యంగా సారంగదరియా సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో లవ్ స్టోరీ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరీ అన్ని అడ్డంకులను దాటుకుని ఈ రోజు అనగా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. లవ్ స్టోరీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది అనేది చెప్పాలంటే ముందుగా కథ చెప్పాలి.

కథ - రేవంత్ (నాగచైతన్య) హైదరాబాద్ లో జుంబా సెంటర్ నడుపుతూ ఉంటాడు. అతను ఉండే ఇంటి పక్క ఇంట్లోనే దిగుతుంది మౌనీ అలియాస్ మౌనిక (సాయిపల్లవి). బిటెక్ చదివిన మౌని హైదరాబాద్లో జాబ్ కోసం ట్రై చేస్తుంటుంది కానీ.. ఎన్ని ప్రయత్నాలు చేసినా జాబ్ రాదు. బాగా ఆలోచించి ఆఖరికి.. తన ఇంటి పక్కనే ఉన్న రేవంత్ జుంబా సెంటర్లో పార్టనర్ గా జాయిన్ అవుతుంది. ఆతర్వాత వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడడం.. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడం జరుగుతుంది. అయితే.. ఇద్దరి కులాలు వేరు అయినా.. ఇద్దరు ఊరు మాత్రం ఒకటే అని తెలుస్తుంది. వీళ్ల ప్రేమను ఇంట్లో ఒప్పుకోరు. పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్లిపోవాలి అనుకుంటారు. అంతా రెడీ ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అనుకునేసరికి.. మౌనిక ఓ సమస్య వలన రాలేకపోతుంది. ఆ సమస్య ఏంటి..? ఇది తెలిసిన రేవంత్ ఎలా రియాక్ట్ అయ్యాడు.? ఆతర్వాత ఏమైంది అనేదే మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్
చైతన్య, సాయిపల్లవి నటన
కథ, కథనం
డైలాగ్స్
మ్యూజిక్
శేఖర్ కమ్ముల టేకింగ్

మైనస్ పాయింట్
లెంగ్త్ ఎక్కువు కావడం..

విశ్లేషణ -నాగ చైతన్య రేవంత్ పాత్రలో అదరగొట్టేశాడు. జుంబా డ్యాన్స్ ట్రైనర్ గా, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించి ఆ పాత్రకు ప్రాణం పోశాడు. చైతన్య కెరీర్ లో బెస్ట్ పర్ ఫార్మెన్స్ లో ఇది ముందు వరుసలో ఉంటుంది. ఇక సాయిపల్లవి కూడా అంతే.. నటనలోను, డ్యాన్స్ లోను మరోసారి మ్యూజిక్ చేసి మెప్పించింది. ఫస్టాఫ్ లో చైతన్య సాయిపల్లవి మధ్య వచ్చిన డ్యాన్స్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పచ్చు. ఇక సెకండాఫ్ లో సారంగదరియా సాంగ్ హైలైట్ అని చెప్పచ్చు. ఈశ్వరీరావు, దేవయాని, ఉత్తేజ్, రాజీవ్ కనకాల తదితర నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. 

శేఖర్ కమ్ముల రాసిన కథ మరియు పాత్రలు మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాల్లోని సంఘటనలు పరిస్థితుల ఆధారంగా సాగుతూ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కథను దర్శకుడు చాలా సున్నితంగా తెరకెక్కించిన విధానం అద్భుతం అని చెప్పచ్చు. ఈ సినిమాలో కులవివక్ష, అలాగే స్త్రీలకు సంబంధించిన సున్నితమైన అంశాన్ని గురించి చెప్పిన తీరు ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది. ఫస్టాప్ లో ఇంకా ఇంటర్వెల్ రాలేదేంటి అనిపించినా.. సెకండాఫ్ మాత్రం చాలా ఎమోషనల్ గా సాగింది. క్లైమాక్స్ అయితే.. అలా చూస్తుండిపోతారు ఆడియన్స్. 

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ.. ఈ సినిమాలో తెలంగాణ యాస విషయంలో చాలా కేర్ తీసుకున్న విషయం డైలాగులు వింటుంటే అర్ధం అవుతుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం సినిమా విజయానికి కీలక పాత్ర పోషించాయని చెప్పచ్చు. ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. అందరూ చూడాల్సిన అద్భుత ప్రేమకథా చిత్రం.

More Related Stories