బాబు.. వైఎస్సార్.. ప‌వ‌న్.. ఓ పాద‌యాత్ర‌..2017-03-28 10:27:20

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మెల్ల‌మెల్ల‌గా రాజకీయాల‌కు చేరువ‌వుతున్నాడు. గుర్రాన్ని నీటి వ‌ర‌కు తీసుకెళ్ల‌గ‌లం గానీ నీళ్లైతే తాగించ‌లేం క‌దా.. ఇప్పుడు ప‌వ‌న్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఆయ‌న‌కు సినిమాలంటే ఇష్టం లేదు. ఏదో అప్పుడొక్కటి ఇప్పుడొక్క‌టి చేస్తాడే గానీ ఎప్పుడూ ఇక్క‌డే అయితే ఉండ‌డు. మ‌రో రెండేళ్ల‌లో ప‌వ‌న్ సినిమాలు వ‌దిలేయ‌డం మాత్రం ప‌క్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. 2019 ఎల‌క్ష‌న్స్ లో ప‌వ‌న్ పోటీ చేయ‌డానికి ఫిక్సైపోయాడు. దానికి వ్యూహ ర‌చ‌న‌లు ఇప్ప‌ట్నుంచే మొదలు పెట్టాడు. ఇందులో భాగ‌మే పాద‌యాత్ర‌.
ఇప్ప‌టి వ‌ర‌కు చ‌రిత్ర‌లో పాద‌యాత్ర చేసిన చాలామంది రాజ‌కీయ నాయ‌కులు బాగానే స‌క్సెస్ అయ్యారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. చంద్ర‌బాబు లాంటి వాళ్ల‌కి ఈ పాద‌యాత్ర ఏకంగా సిఎం సీట్ తీసుకొచ్చింది. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నాడు. ప‌క్కవాళ్లు వ‌ద్దంటున్నా.. ఇబ్బందులు వ‌స్తాయ‌ని చెబుతున్నాడు వినే మూడ్ లో ప‌వ‌న్ లేన‌ట్లు స‌మాచారం. 2018 మ‌ధ్య‌లో గానీ.. చివ‌ర్లో గానీ ప‌వ‌న్ పాద‌యాత్ర మొద‌లు కానున్న‌ట్లు స‌మాచారం. అర‌స‌వెల్లి శ్రీ సూర్య‌నారాయ‌ణ స్వామి నుంచి పాద‌యాత్ర మొద‌లుపెట్టి రాయ‌ల‌సీమ‌లో ముగియ‌నుంది. 
ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకునేందుకు.. దాంతో పాటే త‌నకు బాగా జ‌నాద‌ర‌ణ‌ ఉన్న ప్రాంతాల మీదుగా ఈ పాద‌యాత్ర జ‌ర‌గ‌నుంది. దీన్ని బ‌ట్టే ఆయా స్థానాల్లో ఎవ‌రెవ‌రికి సీట్లు ఇవ్వాల‌నే విష‌యంపై కూడా ప‌వ‌న్ ఓ క్లారిటీ తెచ్చుకోనున్నాడు. పాద‌యాత్ర‌కు కొంత‌ టైమ్ ఉంది కాబ‌ట్టి.. ఈ లోపు సినిమాలు చేయ‌డానికి ఫిక్స‌య్యాడు ప‌వర్ స్టార్. ఇప్ప‌టికే కాట‌మ‌రాయుడు విడుద‌లైంది. ఇక త్రివిక్ర‌మ్ సినిమాను స‌మ్మ‌ర్ లో మొద‌లుపెట్టి.. 2018 జ‌న‌వ‌రికి తెచ్చే య‌త్నాల్లో ఉన్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఆ త‌ర్వాత ఏఎం ర‌త్నం-నీస‌న్ సినిమా ఉంటుంది. ఆ త‌ర్వాత మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ‌లో మ‌రో సినిమా క‌మిట‌య్యాడు. ఇక ఆ త‌ర్వాత మ‌నం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను తెర‌పై చూడ‌టం క‌ష్ట‌మే.
 

More Related Stories