చిరు.. నీ దూకుడు సాటెవ్వ‌డూ..!2017-03-28 10:40:41

ఇప్ప‌టి వ‌ర‌కు ఓ లెక్క‌.. ఇప్ప‌ట్నుంచి ఓ లెక్క‌.. మెగాస్టార్ వ‌చ్చాడు.. చిరంజీవి వ‌చ్చేసాడ‌ని మిగిలిన హీరోలంద‌రూ తెలుసుకోవాల్సిన టైమ్ ద‌గ్గ‌రికి వ‌చ్చేసింది. ఏదో ఇలా వ‌చ్చాడు.. 150వ సినిమా చేస్తాడు.. మ‌ళ్లీ ఎప్పుడో గానీ 151 చేయ‌డ‌నుకున్నారేమో..! కానీ ఫుల్ గా ప్రిపేర్ అయి ఉన్నాడు అన్న‌య్య‌. ఒక‌టి రెండు కాదు.. ఇప్ప‌ట్లో మెగాస్టార్ జోరు త‌గ్గేలా క‌నిపించ‌ట్లేదు. ఏకంగా తొమ్మిదేళ్లు సినిమాల‌కు దూరంగా ఉన్నాడు క‌దా.. చూస్తుంటే ఆ గ్యాప్ అంతా ఇప్పుడు పూడ్చేలా క‌నిపిస్తున్నాడు మెగాస్టార్. ఖైదీ నెంబ‌ర్ 150తో రికార్డులు తిర‌గ‌రాసిన మెగాస్టార్.. ఇప్పుడు వ‌ర‌స‌గా సినిమాలు చేయ‌డానికి డిసైడ్ అయిపోయాడు. 
ఇప్ప‌టికే 151వ సినిమా సురేంద‌ర్ రెడ్డితో.. 152వ సినిమా బోయ‌పాటిశీనుతో చేస్తాన‌ని చెప్పాడు మెగాస్టార్. ఇప్ప‌టికే ఈ చిత్రాల‌కు క‌థ‌లు కూడా సిద్ధం అవుతున్నాయి. ఇందులో సురేంద‌ర్ రెడ్డి సినిమాను రామ్ చ‌ర‌ణ్.. బోయ‌పాటి సినిమాను గీతాఆర్ట్స్ నిర్మించ‌బోతున్నాయి. సురేంద‌ర్ రెడ్డి సినిమా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి క‌థ. ఈ క‌థ ఇప్ప‌టికే తుదిద‌శ‌కు చేరుకుంది. ఇదే ఏడాది సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. 2018లో ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి విడుద‌ల కానుంది. ఇక ఆ త‌ర్వాత 152 బోయ‌పాటితో చేయ‌బోతున్న‌ట్లు మ‌రోసారి క‌న్ఫ‌ర్మ్ చేసాడు మెగాస్టార్. 153 కోసం అశ్వినీద‌త్.. 154 కోసం జెమిని కిర‌ణ్ సిద్ధంగా ఉన్నార‌ని చెప్పాడు చిరు. చూస్తుంటే ఏడాదికి రెండు సినిమాల‌తో ర‌ప్ఫాడించేలా ఉన్నాడు చిరంజీవి.

More Related Stories