ఆ విష‌యంలో నాగార్జున కింగ్..2017-03-28 11:35:46

ప్లానింగ్ అంటే ఇండ‌స్ట్రీలో ముందుగా గుర్తొచ్చే హీరో నాగార్జున‌. ఒక్క రూపాయి ఖ‌ర్చు పెడితే నాలుగు రూపాయ‌లు ఎలా రాబ‌ట్టాలా అని ఆలోచించే బిజినెస్ మెన్ నాగార్జున‌. ఇక సినిమాల విష‌యంలోనూ ఇదే ప‌ద్ద‌తి ఫాలో అవుతుంటాడు నాగార్జున‌. త‌ను నిర్మించే సినిమా అయినా.. న‌టించేది అయినా ప‌ర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తుంటాడు. ఇప్పుడు రాజుగారి గ‌ది 2 విష‌యంలోనూ ఇదే చేస్తున్నాడు గ్రీకువీరుడు. ఈయ‌న ప్ర‌స్తుతం చేస్తోన్న రాజు గారి గ‌ది 2 స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్. ఇందులో ఫ‌స్ట్ టైమ్ నాగార్జున దెయ్యంగా న‌టిస్తున్నాడు. రాజుగారిగ‌దికి సీక్వెల్ గా ఓంకార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. భారీ బ‌డ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు పివిపి.
ఈ మ‌ధ్యే షూటింగ్ మొద‌లైంది. ఎవ‌రికీ పెద్ద హింట్స్ ఇవ్వ‌కుండానే షూటింగ్ య‌మా స్పీడ్ గా లాగించేస్తున్నాడు ఓంకార్. రాజుగారిగ‌ది టైమ్ లో కూడా టీజ‌ర్ విడుద‌ల‌య్యే వ‌ర‌కు అలాంటి సినిమా ఒక‌టి వ‌స్తుంద‌నే విష‌యం కూడా ఎవ‌రికీ తెలియ‌దు. ఇప్పుడు నాగార్జున లాంటి స్టార్ హీరో సినిమాలో ఉన్నా కూడా సైలెంట్ గా ప‌ని కానిస్తున్నాడు ఓంకార్ అన్న‌య్య‌. ఇందులో మ‌నుషుల మైండ్ సెట్ తో ఆడుకునే వ్య‌క్తిగా నాగ్ న‌టిస్తున్నారు. రాజుగారిగ‌ది 2లో సీర‌త్ క‌పూర్, స‌మంత కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌న్ రాజా ర‌న్, టైగ‌ర్ లాంటి ఒక‌ట్రెండు సినిమాల్లో న‌టించినా పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఇప్పుడు స‌డ‌న్ గా నాగ్ లాంటి స్టార్ తో న‌టించే అవ‌కాశం అందుకుంది ఈ రాజా వార‌మ్మాయి. ఇక అక్కినేని కోడ‌లి హోదా వ‌చ్చిన త‌ర్వాత మామ‌య్య‌తో క‌లిసి న‌టిస్తుంది స‌మంత‌. మొత్తానికి ఎలా చూసుకున్నా రాజు గారి గ‌ది 2 నాగార్జున‌కు చాలా ప్ర‌త్యేక‌మైన చిత్రం. జులైలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు నిర్మాత పివిపి.

More Related Stories