రోగ్ రివ్యూ రేటింగ్2017-04-03 16:13:04

ఈ మ‌ధ్య కాలంలో పూరీ జ‌గ‌న్నాథ్ కు స‌రైన హిట్ లేదు. ఈయ‌న‌కు హిట్ ప‌డితే గానీ న‌మ్మే వాళ్లు కొంద‌రున్నారు. ఇలాంటి సంద‌ర్భంలో విడుద‌లైన సినిమా రోగ్. ఇషాన్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. మ‌రి ఈ చంటిగాడు పాత చంటిగాన్ని మ‌రిపించాడా..?

క‌థ‌:

ఓ గోల్ అంటూ లేకుండా ప్రేమ ప్రేమ అంటూ తిరిగే కుర్రాడు చంటి(ఇషాన్). అత‌న్ని ఓ అమ్మాయి మోసం చేస్తుంది.. ఆమె కార‌ణంగా జైలుకు కూడా వెళ్తాడు. అయితే అమ్మాయి కోసం జ‌రిగిన గొడ‌వ‌లో ఓ కానిస్టేబుల్(స‌త్య‌దేవా) కాళ్లు విర‌గ్గొడ‌తాడు చంటి. వాళ్ల ఫ్యామిలీని పోషించ‌డానికి చంటి బ‌య‌ల్దేర‌తాడు. ఈ క్ర‌మంలోనే కానిస్టేబుల్ చెల్లి అంజ‌లి(మ‌న్నారా చోప్రా) చంటిని ప్రేమిస్తుంది. ఆడాళ్లంటే చిరాకు ప‌డే చంటి.. అంజ‌లిని లైట్ తీసుకుంటాడు. ఇదే టైమ్ లో ఓ సైకో అంజ‌లి వెంట ప‌డుతుంటాడు. అప్పుడు అంజ‌లిని సైకో నుంచి ఎలా కాపాడాడు..? అస‌లు చంటి మ‌ళ్లీ ప్రేమ వైపు వ‌చ్చాడా అనేది మిగిలిన క‌థ‌..

న‌టీన‌టులు: 

ఇషాన్, మ‌న్నారా చోప్రా, ఎంజేలా, సుబ్బ‌రాజు, అలీ త‌దిత‌రులు.కొత్త కుర్రాడు ఇషాన్ చూడ్డానికి బాగున్నాడు. కానీ ఫేస్ ఎక్స్ ప్రెష‌న్స్ ఇంకా ప‌ల‌కాలి. అయితే తొలి సినిమా వ‌ర‌కు మ‌నోడు పాస్ అయ్యాడు. కానీ త‌ర్వాత కూడా ఇలాగే అంటే క‌ష్టం. పూరీని ఫాలో అయిపోయాడు. కొత్త‌గా చేయ‌డానికి కూడా ఏం లేదు. పాత లవ్ స్టోరీ కావ‌డంతో బాగానే చేసాడు. హీరోయిన్లు కేవ‌లం అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కే ప‌రిమిత‌మ‌య్యారు. వాళ్ల‌కు క‌థ‌లో భాగం కంటే ఒంటి మీద బ‌ట్ట‌లే త‌క్కువ‌గా ఉన్నాయి. అలీ ఉన్నంత‌లో కాస్త న‌వ్వించాడు. పోకిరి బెగ్గింగ్ కామెడీకి ఇక్క‌డ సీక్వెల్ చేసాడు పూరీ. సుబ్బ‌రాజు కూడా పోలీస్ ఆఫీస‌ర్ గా ప‌ర్లేదు. ఇక సైకోగా అనూప్ సింగ్ ఠాగూర్ బాగా చేసాడు. సినిమాలో అత‌డి కారెక్ట‌రే హైలైట్ అయింది. న‌వ్వు తెప్పించింది.. కోపం తెప్పించింది కూడా అత‌డే. 

టెక్నిక‌ల్ టీం:

క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: పూరీ జ‌గ‌న్నాథ్,సునీల్ క‌శ్య‌ప్ సంగీతం రోగ్ కు ప్ల‌స్ పాయింట్. పాట‌లు బాగోలేవు గానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ముఖ్యంగా అనూప్ ఎంట్రీకి సైకో సైక‌స్య అంటూ ఇచ్చిన బిజి బాగా వ‌ర్క‌వుట్ అయింది. కెమెరా డిపార్ట్ మెంట్ వ‌ర్క్ ప‌ర్లేదు. ద‌ర్శ‌కుడిగా పూరీ జ‌గ‌న్నాథ్ మ‌రోసారి ఫెయిల‌య్యాడు. ఎప్పుడో అయిపోయిన పాత చింత‌కాయ క‌థ‌ల్నే మ‌ళ్లీ మ‌ళ్లీ తీస్తూ ఇప్ప‌టికే విసిగించేయ‌డం మొద‌లుపెట్టిన పూరీ.. రోగ్ తోనూ అదే చేసాడు. చంటిగాడు ప్రేమ‌క‌థ అని ట్యాగ్ లైన్ పెట్టినందుకు అయినా పూరీ ఇడియ‌ట్ లో స‌గం కూడా తీయ‌లేక‌పోయాడు. ఫ‌స్టాఫ్ కాస్త‌లో కాస్త రిలీప్ కానీ సెకండాఫ్ మ‌రీ దారుణంగా ఉంది. ఇలాంటి క‌థ‌లు ఇప్ప‌టికే చాలా చూసేయ‌డంతో రోగ్ పై రోత పుడుతుంది.

చివ‌ర‌గా:

ఈ రోగ్ ప‌క్కా పూరీ మార్క్ .. పాత క‌థ‌నే మ‌ళ్లీ తిప్పి తిప్పి తీసాడు పూరీ.. కొత్త కుర్రాన్ని భ‌రించ‌గ‌లం అనుకుంటే వెళ్లొచ్చు.. లేదంటే హాయిగా మ‌రో సినిమాకు మీ డ‌బ్బులు యూజ్ చేసుకోవ‌చ్చు.

More Related Stories