చెలియా రివ్యూ రేటింగ్2017-04-07 09:51:51

మ‌ణిర‌త్నం నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే చాలు.. ఏదో తెలియ‌ని ఆస‌క్తి ఉంటుంది. పైగా ఓకే బంగారం త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఏదో మ్యాజిక్ చేస్తాడ‌ని న‌మ్మారు. మ‌రి చెలియా ఎలా ఉంది.. మ‌ణి ఆశ‌ల్ని నిల‌బెట్టిందా..?

క‌థ‌:

కార్తి ఓ పైలైట్. ఓ యాక్సిడెంట్ లో హాస్పిట‌ల్ పాల‌వుతాడు. అత‌న్ని ట్రీట్ చేయ‌డానికి వ‌స్తుంది అదితిరావ్ హైద్రీ. ఆ ప‌రిచ‌యంతోనే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ ప‌డుతుంది. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ ప్రేమ‌లో మునిగిపోతారు. అదే టైమ్ లో కోపాలు, తాపాలు న‌డుస్తాయి. ఓ టైమ్ లో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ పెద్ద‌దై కార్తిని వ‌దిలేసి వెళ్లిపోతుంది అదితి. అదే టైమ్ లో కార్గిల్ వార్ కు వెళ్లిన కార్తి.. పాకిస్థాన్ సైనికుల‌కు చిక్కుతాడు. అక్క‌డి పెషావ‌ర్ జైల్లో శిక్ష అనుభ‌విస్తుంటాడు. కొద్ది కాలం త‌ర్వాత జైలు నుంచి పారిపోయి ఇండియాకు వ‌స్తాడు. మ‌రి త‌న ప్రేయ‌సిని మ‌ళ్లీ క‌లుసుకున్నాడా లేదా..? అస‌లు ఏం జ‌రిగింది..? అనేది మిగిలిన క‌థ‌.

క‌థ‌నం:

చెలియా క‌థ చాలా సింపుల్. ఓ ఖైదీ జైల్లో ఉండి త‌న గ‌తాన్ని చెప్పుకోవ‌డ‌మే.. గుర్తు చేసుకోవ‌డ‌మే..! తొలి సీన్ లోనే కార్గిల్ వార్ చూపిస్తాడు మ‌ణిర‌త్నం. అక్క‌డ్నుంచే క‌థ మొద‌లుపెట్టాడు. పాకిస్థాన్ జైల్లో ఉన్న కార్తి.. త‌న గ‌తాన్ని గుర్తు చేసుకోవ‌డం.. ఒక్కో సీన్ చెప్పుకుంటూ వెళ్లి.. మ‌ళ్లీ ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్ర‌స్తుతానికి రావ‌డం ఇవ‌న్నీ చాలా కాలం నుంచి చూస్తున్న‌వే. మ‌రోసారి అదే స్క్రీన్ ప్లే ఫాలో అయ్యాడు మ‌ణిర‌త్నం. ఫ‌స్టాఫ్ లో అదితితో ప‌రిచ‌యం.. ప్రేమ‌.. ఆ త‌ర్వాత జైలు నుంచి పారిపోవ‌డం చూపించాడు. సెకండాఫ్ లో వాళ్ల మ‌ధ్య గొడ‌వ‌లు, విడిపోవ‌డం.. జైలు నుంచి పారిపోయిన కార్తి ఇండియాకు రావ‌డాన్ని చూపించాడు. ఫ‌స్ట్ హాఫ్ వ‌ర‌కు సినిమా బాగానే న‌డిచినా.. ప్రీ ఇంట‌ర్వెల్ నుంచి పూర్తిగా గాడి త‌ప్పింది. భ‌రించ‌లేనంత స్లో అయిపోతుంది. మ‌ణిర‌త్నం మ్యాజిక‌ల్ సీన్స్ అక్క‌డ‌క్క‌డా క‌నిపించినా.. ఓవ‌రాల్ గా చెలియా నిరాశ‌ప‌రుస్తుంది.

న‌టీన‌టులు:

కార్తి, అదితిరావ్ హైద్రీ, డిల్లీ గ‌ణేష్, ఆర్ జే బాలాజీ..కార్తి పైలైట్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. స‌న్న‌గా మారి కుర్రాడిలా క‌నిపించాడు. న‌ట‌న‌లోనూ తానేంటో నిరూపించుకున్నాడు. ఇక డాక్ట‌ర్ గా అదితి రావ్ హైద్రీ అంద‌రికీ షాకిచ్చింది. న్యాచుర‌ల్ యాక్టింగ్ ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా కార్తి, అదితి మ‌ధ్య వ‌చ్చిన ప్ర‌తీ స‌న్నివేశంలో కెమిస్ట్రీ అదిరింది. కానీ సీన్స్ ఆ స్థాయిలో లేక‌పోవ‌డంతో వాళ్లు కూడా ఏం చేయ‌లేక‌పోయారు. మిగిలిన వాళ్ల‌లో ఆర్ జే బాలాజీ ఓకే.. అదితి తాత‌గా డిల్లీ గ‌ణేష్ ప‌ర్లేద‌నిపించాడు.

టెక్నిక‌ల్ టీం:

చెలియా హోల్ క్రెడిట్ మొత్తం ఇవ్వాల్సిన వ్య‌క్తి సినిమాటోగ్ర‌ఫ‌ర్ ర‌వివ‌ర్మ‌న్ కే. శ్రీ‌న‌గ‌ర్, జ‌మ్మూకాశ్మీర్ అందాల‌ను త‌న కెమెరాలో అద్భుతంగా బంధించాడు ర‌వి. ముఖ్యంగా ఫ‌స్టాఫ్ లో వ‌చ్చే ప్ర‌తీ స్నో సీన్ అద్భుతం. ఇక ఏఆర్ రెహమాన్ కూడా త‌న ప‌ని తాను చేసాడు. పాట‌లు బాగున్నాయి. కానీ మ‌ణిర‌త్నం త‌న మ్యాజిక్ డైరెక్ష‌న్ లో చూపించ‌లేక‌పోయాడు. స్క్కీన్ ప్లే కూడా తేలిపోయింది. ముందుగా ఊహించే సీన్లు.. బోర్ కొట్టించే సంభాష‌ణ‌ల‌తో నీర‌సం తెప్పించాడు మ‌ణిర‌త్నం. ఓకే బంగారం త‌ర్వాత ఆయ‌న నుంచి వ‌చ్చిన స్లో సినిమానే చెలియా. క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: మ‌ణిర‌త్నం.

చివ‌ర‌గా: 

ఈ చెలియాను భ‌రించ‌డం క‌ష్ట‌మే..!

More Related Stories