అప్పుడే కోటి రెమ్యునరేషనా



teja sajja
2021-07-17 13:39:20

ఇంద్ర సినిమాతో ఫేమ్ అయిన తేజ సజ్జా… ఓ బేబి, జాంబిరెడ్డి సినిమాలతో ప్రజాదరణ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇష్క్ అనే చిత్రం విడుదలకు సిద్దంగా వుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇదంతా బాగానే వుంది. ప్రస్తుతం తేజ సజ్జా రెమ్యునరేషన్ కోటి రూపాయలంటూ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన కొందరు నిర్మాతలు పెదవి విరుస్తున్నారు. మూడు సినిమాలకే కోటి రూపాయలు రెమ్యునరేషన్ పెంచితే ఎలా? జాంబిరెడ్డి సినిమా థియేటర్లలో నాలుగున్నర కోట్ల దాకా బిజినెస్ చేసింది.

శాటిలైట్, ఆహా ఓటీటీలో వచ్చిన బిజినెస్ చూస్తే సినిమా పై ఎంత వచ్చింటుంది అనేది ఎవరైనా అంచనా వేసుకోవచ్చు. అదీ కాక ఆ హీరో నటించాడని థియేటర్ బిజినెస్ జరగలేదు. ఆ సినిమాకు చేసిన ప్రమోషన్ మూలంగానే ఆ బిజినెస్ జరిగింది. ఇదంతా తేజ సజ్జా రెమ్యునరేషన్ పెంచుకోవడానికి ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ల సోషల్ మీడియా ఆర్మీ చేస్తున్న హంగామానే తప్ప మరొకటి కాదు అని చెబుతున్నారు. ప్రస్తుతం తేజ సజ్జ నటిస్తున్న హనుమాన్ కు సంబంధించి ఓ ఫైట్ చిత్రీకరణ పూర్తయ్యిందని తెలిసింది.
 

More Related Stories