విజయ్ దేవరకొండకి 100 కోట్ల రెమ్యునరేషన్..షాకింగేvijay
2020-03-08 14:25:27

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజయి భారీ డిజాస్టర్ గా నిలుచింది. ఇప్పుడు పూరీ-విజయ్ కంబినేషన్లో లైగర్ అనే సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాకి వీటితో పాటు దిల్ రాజు ప్రొడక్షన్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో మరో కొత్త సినిమా చేస్తున్నాడు. ఇక విజయ్ కు టాలీవుడ్ లోఅలాగే బాలీవుడ్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని కరణ్ జోహార్ ఎప్పటినుండో విజయ్ తో సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి డియర్ కామ్రేడ్ సినిమా రీమేక్ అనుకున్నా కానీ దానిని హిందీలో డబ్ చేసి రిలీజ్ చేశాడు కాబట్టి అది వర్క్ అవుట్ కాలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం పూరి లైగర్ సినిమాకి కరణ్ జోహార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఒకరకంగా డియర్ కామ్రేడ్ తోనే విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడని అనుకోవాలి ఈ సినిమాతో అది ఇంకాస్త పెరుగుతుంది. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా కాకుండానే కరణ్ జోహార్ విజయ్ కు ఆఫర్ చేసిన 100 కోట్ల డీల్ ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు కరణ్ జోహార్ విజయ్ దేవరకొండతో రానున్న మూడు సంవత్సరాలలో సంవత్సరానికి ఒక సినిమా చొప్పున వరసగా మూడు సినిమాలు తీసే ప్లాన్ లో ఉన్నాడనే ప్రచారం సంచలనం రేపుతోంది. దీనికి విజయ్ సరే అంటే కనుక ఈ మూడు సినిమాలకు సంబంధించి అతడికి 100 కోట్ల పారితోషికం ఇచ్చే విధంగా ఎగ్రిమెంట్ చేసుకుందామని విజయ్ పై కరణ్ జోహార్ ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజానికి పెద్ద డీల్ అని చెప్పాలి. ఎందుకంటే మన హీరోలు ఇప్పటిదాకా అంత రెమ్యునరేషన్ తీసుకోలేదు. మహేష్ బాబు రైట్స్ రూపంలో తీసుకున్నా అవి ఇంత ఉంటాయని, అంటున్నారు. చూడాలి మరి ఇందులో నిజం ఎంతుందో ?  

 

More Related Stories