కరోనా వైరస్ వల్ల ఇండస్ట్రీ1000 కోట్ల నష్టం.. Corona tollywood
2020-03-20 20:03:42

కరోనా వైరస్ కారణంగా గత నెల రోజులుగా ఇండస్ట్రీ స్తంభించిపోయింది. ఎక్కడి వారు అక్కడే నిలిచి పోయారు. గత వారం రోజులుగా షూటింగ్స్ కూడా అన్ని నిలిపేశారు. ప్రభుత్వం కూడా ఎలాంటి జన సంచారం ఉన్న కార్యక్రమాలు చేయొద్దు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. సినిమా థియేటర్లు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అని మార్చి 31 వరకు క్లోజ్ చేసారు. ఇదిలా ఉంటే కరోనా వైరస్ కారణంగా సినిమా ఇండస్ట్రీ దారుణంగా నష్టపోతుంది. ఇప్పటికే దాదాపు వెయ్యి కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు సినిమా విశ్లేషకులు. 

తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ ఇండస్ట్రీలలో చాలా సినిమాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. కొన్ని భారీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న సినిమాలు కూడా ఇంటికే పరిమితం అయిపోయాయి. దాంతో నిర్మాతలకు నష్టాలు భారీగానే వస్తున్నాయి. అనుకోకుండా వచ్చిన ఈ వైరస్ తమ కొంప ముంచుతుంది అంటూ గగ్గోలు పెడుతున్నారు నిర్మాతలు. వాళ్ళు ఎంతగా ఏడుస్తున్న కూడా ప్రభుత్వాలు మాత్రం కరుణించడం లేదు. 

ఒకరి నుంచి ఒకరికి వేగంగా సోకే వైరస్ కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మరికొన్ని రోజుల వరకూ ఎటువంటి సినిమా షూటింగ్స్ జరపడానికి లేదు అంటూ వారు హెచ్చరించారు. దానికి తోడు సినిమా థియేటర్స్ కూడా అన్ని మూసేశారు. రోజురోజుకు కరోనా వైరస్ సోకిన కేసులు ఎక్కువైపోతున్నాయి. దాంతో మరికొన్ని రోజుల వరకూ పరిస్థితి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించేలా ఉంది. మరి ఇంకా ఎన్ని కోట్ల నష్టం వస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేం అంటున్నారు ట్రేడ్ పండితులు. పరిస్థితులు చూస్తుంటే మరో ఐదు వందల కోట్ల నష్టం ఖాయం అనిపిస్తుంది. 

More Related Stories