మెగా పవర్ స్టార్ సినీ ప్రస్థానానికి 13ఏళ్ళుRam charan
2020-09-29 15:24:46

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినీ ప్రస్థానం మొదలై ఈరోజుకు 13ఏళ్ళు పూర్తయ్యింది. చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రేయేట్ చేసుకున్నారు. రాంచరణ్ ఎంట్రీ క్రేజీ దర్శకుడు పురిజగన్నాథ్ చేతుల మీదగా జరిగింది. పూరి చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ తరవాత చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా చేసాడు. ఇక మగధీర సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడంతో చరణ్ ఇండస్ట్రీలో తన మార్క్ వేసుకున్నారు. ఆ తరవాత చరణ్ అనేక సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. నటనలోనే కాకుండా చరణ్ డ్యాన్స్, ఫిట్ నెస్ విషయంలోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఇదిలా ఉండగా చరణ్ రంగస్థలం సినిమాతో నటనలో మరో మెట్టు ఎక్కారు. రంగస్థలం లో చరణ్ నటనకు ఇండస్ట్రీ ప్రముఖులు ఫిదా అయ్యారు. ఇక తరవాత వచ్చే సినిమాల్లో చరణ్ తన ప్రస్థానాన్ని ఎలా కొనసాగిస్తారో చూడాలి.

More Related Stories