రూలర్ 2 వీక్స్ కలెక్షన్స్.. బాలయ్య ఎంత ముంచాడంటే..ruler
2020-01-04 06:50:40

బాలయ్య నటించిన రూలర్ సినిమాపై అంచనాలు ముందు నుంచి కూడా యావరేజ్ గానే ఉన్నాయి. జై సింహా కాంబినేషన్ లో వచ్చినా కూడా రొటీన్ కంటెంట్ ఉండటంతో పెద్దగా అంచనాలు అయితే లేవు. ఇక విడుదల తర్వాత కూడా సీన్ మారలేదు. ఇప్పటికే సినిమా విడుదలై రెండు వారాలు గడిచిపోయింది. ఇప్పుడు కలెక్షన్స్ కూడా బయటికి వచ్చాయి. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న రూలర్ కలెక్షన్ల పరంగా కూడా వెనకబడిపోయింది. బాలయ్య సినిమాకు రావాల్సిన కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేదు ఈ చిత్రం. రొటీన్ కథని మాస్ ఆడియన్స్ కి నచ్చేలా కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అసలు ఎందుకు జరుగుతున్నాయో తెలియని ఫైట్స్.. ఎప్పుడు రావాలో తెలియని పాటలతో రూలర్ అంతా కలగాపులగం అయిపోయింది. బాలయ్య పోలీస్ అవతారం కూడా పెద్దగా క్లిక్ కాలేదు. దాంతో సినిమా డిజాస్టర్ అయిపోయింది. రెండు వారాల్లో ఈ సినిమా కేవలం 9 కోట్లు మాత్రమే వసూలు చేసింది. 17 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన బాలయ్య అందులో సగం కూడా తీసుకురాలేకపోయాడు. కథానాయకుడు, మహానాయకుడు తర్వాత రూలర్ సినిమాతో డిజాస్టర్స్ హ్యాట్రిక్ పూర్తి చేసాడు ఈయన. ప్రస్తుతం బోయపాటి సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు బాలయ్య. ఈ చిత్రం జనవరిలోనే పట్టాలెక్కనుంది.

 

More Related Stories