అందుకే కే.జీ.ఎఫ్-2 నుంచి రమ్యకృష్ణ ఔట్..Ramya Krishna
2020-02-13 22:13:48

ఒకప్పుడు హీరోయిన్ గా తన గ్లామర్ తో ఎంతగానో అలరించిన రమ్యకృష్ణ.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తల్లి, అత్త పాత్రల్లో నటిస్తూ ఫుల్లు బిజీగా ఉంది. అయితే.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలితో ఈ శివగామికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. దాంతో  తెలుగు, తమిళ, మళయాళ, హిందీ ఇలా అన్నీ భాషల సినిమాల్లో నటిస్తోంది. అందులోభాగంగా ఇటీవలె ఓ భారీ క్రేజీ ప్రాజెక్టుల్లో ఆఫర్ వచ్చిందట ఈ నీలాంబరికి. కానీ ఆ అవకాశాన్ని వదులుకున్నట్టు సమాచారం. 

బ్లాక్ బస్టర్ కే.జీ.ఎఫ్ సిరీస్ 'కే.జీ.ఎఫ్-2 సినిమాలో లేడీ పీఎమ్ పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించారట చిత్రయూనిట్. అయితే ఆ సినిమాకున్న క్రేజ్.. ఆ పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రమ్యకృష్ణ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. దాంతో ఆమె స్థానంలో బాలీవుడ్ నటి రవీనా టండన్ ని తీసుకున్నారట. దీంతో.. కారణం ఏదైనా రమ్యకృష్ణ ఓ అరుదైన ప్రాజెక్ట్ లో నటించే అవకాశం చేజార్చుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంతకీ ఈ వెటరన్ బ్యూటీ ఎంత డిమాండ్ చేసిందనేది తెలియరాలేదు.

ఇకపోతే.. యశ్ హీరోగా తెరకెక్కుతున్న కే.జీ.ఎఫ్-2లో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కనిపించనున్నాడు. అలాగే ఒక ముఖ్యమైన పాత్రలో రావు రమేశ్ నటిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ సంచలన విజయాన్ని సాధించడంతో, సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు వున్నాయి. ఏదేమైనా.. రెమ్యునరేషన్ కోసం రమ్యకృష్ణ 2020 మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ మిస్ చేసుకోవడం ఏంటని చర్చించుకుంటున్నారు సినీజనాలు.

More Related Stories