సుశాంత్ హీరోగా అర్జున్ రెడ్డి 2.. అల్లు అర్జున్ దర్శకుడు.. Sushanth
2020-03-17 17:16:57

అదేంటి.. అలా ఎలా కుదిరింది అనుకుంటున్నారా..? అర్జున్ రెడ్డి అంటే విజయ్ దేవరకొండ కదా.. పైగా దర్శకుడు సందీప్ రెడ్డి కానీ అల్లు అర్జున్ ఏంటి..? ఏంటి ఈ కన్ఫ్యూజన్ అసలు అనుకుంటున్నారు కదా..? ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. బన్నీ, సుశాంత్ కాంబినేషన్ లో అర్జున్ రెడ్డి పార్ట్ 2 అలా కుదిరిపోయింది అంతే. 2020 సంక్రాంతికి వచ్చి సంచలన విజయం సాధించిన అల.. వైకుంఠపురములో.. సినిమాలో బన్నీ, సుశాంత్ కలిసి నటించారు. ఈ చిత్రంలో సుశాంత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. 

అయితే సినిమాలో మనోడు మరీ సైలెంట్ గా ఉన్నాడు.. అసలు డైలాగులే లేవు అంటూ కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. అయితే ఆయన మాట్లాడిన సన్నివేశాలను త్రివిక్రమ్ ఎడిట్ చేసాడు. ఇప్పుడు డిలీటెడ్ సీన్స్ లో ఒకటి విడుదల చేసారు. అందులోనే అర్జున్ రెడ్డి కూడా ఉన్నాడు. అల్లు అర్జున్‌, సుశాంత్‌ మధ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర సాగే ఓ సన్నివేశాన్ని సినిమాలోంచి తీసేసారు. స్విమ్ చేస్తున్న సుశాంత్ దగ్గరికి వచ్చి.. నీకు మందు, సిగరెట్, డ్రగ్స్ అలవాటు ఉందా అంటూ బన్నీ అడుగుతాడు. చీచీ నాకు లేవంటే.. సరే మరి తాను ఓ షార్ట్‌ ఫిల్మ్స్‌ తీసానని.. ఎలా ఉందో చూడాలంటూ సుశాంత్‌కు చెప్తాడు బన్నీ. 

అందులో సుశాంత్‌ మందు తాగుతున్న వీడియోతో పాటు సిగరెట్, డ్రగ్స్ తీసుకుంటున్నవి ఉంటాయి. దీనికి అర్జున్‌ రెడ్డి పార్ట్‌ 2 అని పేరు పెట్టానని చెప్తాడు బన్నీ. దీంతో కంగారు పడి సుశాంత్‌ నేనేం చేయాలని బన్నీని అడిగిన వెంటనే సుశాంత్‌ సిటీ బస్సు వెనక పరిగెట్టే సీన్ ఉంది. కారులోంచి మురళీ శర్మ తన కొడుకు సుశాంత్ పరిగెట్టడం చూసి బాధ పడుతుంటాడు. అయితే ఈ సీన్ చూసిన తర్వాత తీసేసి మంచి పని చేసారు.. అంతగా ఏం లేదని కమెంట్స్ వస్తున్నాయి. 

More Related Stories