కేజీఎఫ్2 క్లైమాక్స్ ఇదేKGF Chapter 2
2020-04-04 13:08:42

పాన్ ఇండియా సినిమాగా విడుదలైన కెజిఎఫ్ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన కెజిఎఫ్ అన్ని ప్రధాన భాషల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. గోల్డ్ మైన్ లో జరిగే కథాంశం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  కన్నడ సినిమా ఈ స్థాయిలో రికార్డులు సాధించడం ఇదే మొదటిసారి కూడా. దాంతో దర్శకుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ ను కూడా తెరెకెక్కిస్తున్నారు.  కేజీఎఫ్ 2 షూటింగ్ కూడా  సగం వరకు పూర్తయింది.  కాగా ఈ సినిమాను అక్టోబర్ 23న విడుదల చేస్తామని కూడా చిత్ర బృందం ప్రకటించింది.
 
ఈ సినిమాలో సంజయ్ దత్ అధీర రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా ఒక కీలక పాత్రలో బాలీవుడ్ నటి రవీన టాండన్ నటిస్తుంది. రవీనా దేశ ప్రధాని పాత్రలో నటిస్తుండగా తాను నెగిటివ్ పాత్రలో నటిస్తున్నట్టు స్వయంగా ఆవిడే చెప్పారు. అయితే కేజీఎఫ్ 2 లో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రాఖీ బాయ్ ని ప్రధాని తన సైన్యం తో చంపేస్తుందట. కాగా రాఖీ బాయ్ తన తల్లి చెప్పిన మాట " చనిపోయేటప్పుడు రాజులా చనిపోవాలి" అన్న మాట నెరవేరిందన్న ఆనందంతో చనిపోతాడట. అయితే క్లైమాక్స్ ఇదే ఉంటుందా లేదా అన్నది తెలియాలనే అక్టోబర్ వరకు ఆగాల్సిందే.  

More Related Stories