ఇండియన్ 2 పుష్పలో ఐటెం సాంగ్స్...పాయల్ క్లారిటీPayal Rajput
2020-07-05 23:35:31

గత కొద్దిరోజులుగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇండియన్ 2 సినిమాలో కమల్ సరసన ఒక ఐటెం సాంగ్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇది కాక తాజాగా రెండ్రోజుల నుండి ఆమె అల్లు అర్జున్-సుకుమార్ ల పుష్ప సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేస్తోందని ప్రచారం మొదలయింది. రెండు క్రేజ్ ఉన్న సినిమాలే కావడంతో ఆమె వెంటనే ఒప్పెసుకుందనేది ఆ ప్రచారం సారాంశం. అయితే ఈ విషయం మీద గతంలో ఒక సారి క్లారిటీ ఇచ్చినా ప్రచారం మాత్రం ఆగలేదు. 

ఇక తాజాగా ఈ విషయం మీద ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. " నా గురించి ఈ పుకార్లు ఎలా పుట్టుకు వస్తాయో తెలీదు. నేను ఏ సినిమాలోనూ ఎటువంటి సాంగ్ చేయడం లేదు. కనీసం అందుకోసం నన్ను ఎవరూ అప్రోచ్ కూడా కాలేదు. గత కొద్దిరోజులుగా నాకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఇండియన్ 2, పుష్ప సినిమాల్లో నేను ఐటెం సాంగ్ చేస్తున్నాను అంటూ. అందుకే అందరికీ ఒకే సారి క్లారిటీ ఇస్తున్నాను, అవన్నీ పుకార్లు మాత్రమె, అంతే కాదు ప్రస్తుతానికి నేను అసలు ఎటువంటి షూట్ లోనూ పాల్గొనడం లేదు కూడా" అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

More Related Stories