జులై 20 నుంచి థియేటర్స్ ఓపెన్.. ఆ ప్రభుత్వం సంచలనం.. China box office
2020-07-18 15:33:18

కరోనా దెబ్బకు 4 నెలలుగా థియేటర్స్ అన్నీ మూత పడ్డాయి. ఎగ్జిబిటర్స్ కూడా రోడ్డున పడుతున్నారు. పాపం వాళ్లకు జీవనాధారం కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడెప్పుడు మళ్లీ ధియేటర్స్ ఓపెన్ అవుతాయా.. ఎప్పుడెప్పుడు మళ్లీ తమ బతుకులు గాడిన పడతాయా అని చూస్తున్నారు. మరోవైపు కరోనా విళయతాండవం చేస్తుంటే థియేటర్స్ ఓపెన్ చేయాలనే మాట కూడా మరిచిపోతున్నాయి ప్రభుత్వాలు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జులై 20 నుంచి థియేటర్స్ ఓపెన్ చేయడానికి ఓ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది. మరో రెండు మూడు రోజుల్లో కఠిన ఆంక్షల మధ్య థియేటర్స్ ఓపెన్ చేయబోతున్నారు.  

అయితే అదిక్కడ మాత్రం కాదు.. ప్రస్తుతం మన దేశంలో ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత కూడా థియేటర్స్ తెరిచేంత సాహసం మన ప్రభుత్వం చేయడం లేదు. లాక్‌డౌన్ మినహాయింపులు ఇస్తున్నా థియేటర్లకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. అయితే చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 20 నుంచి తిరిగి సినిమా హాళ్లను తెరవాలని నిర్ణయించింది. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తెరుస్తామని అధికారులు ప్రకటించారు కూడా. దాంతో అక్కడ ఆడియన్స్ కు కూడా కాస్త ఎంటర్ టైన్మెంట్ దొరికేలా కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో చాలా కఠినంగా రూల్స్ పెట్టి థియేటర్స్ అయితే ఓపెన్ చేసాయి. ఇప్పుడు చైనా కూడా ఈ నిర్ణయమే తీసుకుంది. మన దగ్గర మాత్రం ఓటిటి వైపు చూస్తున్నారు నిర్మాతలు. మరి మన దగ్గర థియేటర్స్ ఓపెనింగ్ ఎప్పుడో చూడాలి. 

More Related Stories