సోనూ బాయ్ గ్రేట్..తెలంగాణ బాలుడి కోసం 20లక్షల సాయంSonu Sood
2020-10-03 15:29:06

రీల్ యాక్టర్ నుండి రియల్ హీరో అనిపించుకుంటున్న నటుడు సోనూ లాక్ డౌన్ వేళ మొదలుపెట్టిన మంచి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తాజాగా సోనూ సూద్ తెలంగాణలోని ఓ  బాలుడి వైద్య సహాయం నిమిత్తం రూ.20 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. మెహబూబ్ నగర్ జిల్లా డోర్నకల్ మండలం సంకీస గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మీ దంపతుల కుమారుడు హర్షవర్ధన్ (6)కు లివర్ ప్రాబ్లమ్ ఉండటంతో ఆస్పత్రిలో చేరారు. కాగా డాక్టర్లు బాలుడికి లివర్ ట్రాన్సప్లాంట్ చేయాలని ఆపరేషన్ కు 20లక్షలు అవుతాయని పేర్కొన్నారు. నాగరాజు కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా తోటి ఉద్యోగులు 2లక్షలు సహాయం చేసారు. కానీ అవి ఆపరేషన్ కి సరిపోవని సోనూ సూద్ సహాయం కోరారు. ఈ మేరకు సోనూ హైదరాబాద్ లో షూటింగ్ లో ఉండగా ఆ ప్రాంతానికి నాగరాజు స్నేహితులు వెళ్లారు. హర్షవర్ధన్ ఆరోగ్య పరిస్థితిని సోనుకు వివరించడంతో పాటు అతడి గురించి మీడియాలో వచ్చిన క్లిప్పింగ్ ను సోనుకు చూపించారు. అక్కడే ఉన్న నటులు బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి లు తెలుగులో ఉన్న విషయాన్ని సోనుకు కన్వర్ట్ చేసి చెప్పారు.దాంతో విషయం అర్ధం చేసుకున్న సోనూ బాలుడి లివర్ మార్పిడి ఆపరేషన్ తానే చెపిస్తాననని అన్నారు. అంతే కాకుండా అపోలో ఆసుపత్రికి ఫోన్ చేసి వైద్యం మొదలు పెట్టాలని సూచించారు. సోనూ సహాయం అందించడానికి ముందు రావడంతో బాలుడి తల్లి తండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేశారు.

More Related Stories