20 ఏళ్ల తరవాత ఆ హిట్ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన తేజTeja
2021-02-23 00:26:27

టాలీవుడ్ క్రేజీ దర్శకుల్లో తేజ ఒకరు. కెమెరా మెన్ గా కెరీర్ ను మొదలు పెట్టిన తేజ " చిత్రం" సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. కాలేజి లవ్ స్టొరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. లవ్ రొమాంటిక్ కామెడీతో ప్రేక్షకులను తేజ తన వైపు తిప్పుకున్నాడు. ఇక ఈ సినిమా విజయం తరవాత వరుస ఆఫర్లను దక్కించుకుని బిజీ దర్శకుడిగా మారాడు. అయితే కొన్నేళ్ల క్రితం సినిమాలకి గ్యాప్ ఇచ్చిన తేజ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్ళీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో బెల్లంకొండ శ్రీనివాస్,కాజల్ తో సీత అనే సినిమాను తీసాడు. సీత మాత్రం నిరాశపరిచింది. ఇక తాజాగా ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న తేజ మరో సినిమాను ప్రకటించాడు. తేజ మొదటి సినిమా "చిత్రం" కు సీక్వెల్ గా "చిత్రం 1.1" ను తెరకెక్కించబోతున్నట్టు స్పష్టం చేశాడు. ఈ సినిమాలో 45 కొత్త క్యారెక్టర్ లను పరిచయం చేయబోతునట్టు ప్రకటించాడు. ఇక ఈ సినిమాకు కూడా చిత్రం సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన ఆర్పీ పట్నాయక్ స్వరాలు అందించబోతునట్టు తెలిపాడు.

More Related Stories