బన్నీని కలవడానికి 200 కి.మీ నడిచిన అభిమానిallu arjun
2020-10-04 00:25:56

తమకు ఒక హీరో నచ్చాడంటే అభిమానులు తమ సొంత మనిషిలాగా ఫీల్ అవుతారు. హీరో సినిమా హిట్ అయితే తామే ఏదో సాధించినట్టు సంబురపడుతారు. కొందరు అభిమానులు తమ హీరో సినిమా హిట్ అవ్వాలని యాటలు కోస్తూ పూజలు కూడా చేస్తారు. ఇక సినిమా విడుదలైన రోజు సినిమాలో హీరో కంటే ముందుగానే లేచు థియేటర్ల వద్ద పాలాభిషేకాలు, బ్యాండు, బ్యానర్ లు ఒక సందడి వాతావరణం కనిపించేలా చేస్తారు. అదే విధంగా సినిమా ఫ్లాప్ అయ్యినా చాలా ఫీల్ అయిపోతారు. కొంతమంది ఆరోజు అన్నం తినడం కూడా మనేస్తారు. ఇక అలాంటి అభిమానులు తమ హీరోను ఒక్కసారి చూస్తే, తాకితే జీవితం ధన్యం అవుతుందని కూడా భావిస్తారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. 

హీరోల ఆడియో ఫంక్షన్లకు వెళ్లడం, వాళ్ళు ఏదైనా షాప్ ఓపెనింగ్ లకు వెళ్ళినప్పుడు ముందే వెళ్లి అక్కడ ఉండటం లాంటివి చేస్తారు. కానీ తాజాగా ఓ అభిమాని తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ ను కలవడానికి 200 కిలోమీటర్లు నడిచాడు. మాచర్ల నుండి బన్నీ అభిమాని అతడి ఆఫీస్ కు కాలినడకన రావడంతో బన్నీ షాక్ అయ్యాడు. వెంటనే అతడిని లోపలికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాడు. అతడి సమాచారం తెలుసుకున్నాడు. ఆఫీస్ లో అభిమాని మరియు బన్నీ మాస్కులు ధరించి కొద్దిసేపు ముచ్చటించారు. అల్లు అర్జున్ తనతో మాట్లాడటంతో అభిమాని చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. కాగా నిజానికి హీరోలు అలాంటి అభిమానులను కలిగి ఉండటం అదృష్టమనే చెప్పాలి.

More Related Stories