2019 ఈ టాలీవుడ్ స్టార్స్ కు చాలా స్పెషల్..Tollywood Stars
2019-12-28 00:06:09

ఒక్కో ఏడాది క్యాలెండర్ గడిచిపోతూ ఉంటే అది కొందరికి తీపి జ్ఞాపకాలను.. మరికొందరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చి వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు కూడా 2019 చివరి దశకు వచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో కొత్త క్యాలెండర్ మనం చూడబోతున్నాం. మారిన ఈ పాత క్యాలెండర్ తెలుగు ఇండస్ట్రీలో కొందరికి మోస్ట్ స్పెషల్ ఇయర్ గా మారిపోయింది. వాళ్ల కెరీర్ ను ఒక్కసారిగా మార్చేసిన ఏడాది ఇది. అలాంటి వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం..

2019 సీనియర్ హీరో వెంకటేష్ కు చాలా బాగా కలిసొచ్చింది. గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల చేయని ఆ విక్టరీ హీరో.. 2019లో మాత్రం రెండు సినిమాలతో వచ్చాడు. ఏడాది మొదట్లో సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన ఎఫ్2 సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా దాదాపు 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ ఏడాది చివర్లో అల్లుడు నాగచైతన్యతో కలిసి నటించిన వెంకీ మామ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ రెండు విజయాలతో 2019 సంవత్సరం వెంకటేష్ కు చాలా ప్రత్యేకంగా మారిపోయింది.

మామతో పాటే అల్లుడు నాగచైతన్య కూడా 2019ని మెమొరబుల్ గా మార్చుకున్నాడు. ఈ ఏడాది రెండు సినిమాలతో వచ్చి రెండుసార్లు ప్రేక్షకులను మెప్పించాడు నాగ చైతన్య. భార్య సమంతతో కలిసి మజిలీ దాదాపు 40 కోట్ల షేర్ వసూలు చేసింది. నిన్నుకోరి లాంటి ఎమోషనల్ ఎంటర్టైనర్ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా ఇది. ఇక ఆ తర్వాత సమంత లీడ్ రోల్ చేసిన ఓ బేబీ సినిమా చివర్లో రెండు నిమిషాలు కనిపించే అతిథి పాత్రలో మెరిశాడు నాగ చైతన్య. ఇది కూడా మంచి విజయం సాధించింది. ఏడాది చివర్లో వెంకీమామ కూడా అద్భుతమైన వసూళ్లు తీసుకొచ్చింది. దాంతో 2019 చైతు కెరీర్ లో ప్రత్యేకంగా మారిపోయింది.

సాయి ధరమ్ తేజ్ కూడా 2019ని తన జీవితంలో మరచిపోలేడు. గతేడాది వరకు ఈయనకు అరడజను ఫ్లాపులు ఉన్నాయి. కనీసం 5 కోట్లు కూడా వసూలు చేయలేక దారుణమైన స్థితికి దిగజారిపోయింది సాయి కెరీర్. ఇలాంటి సమయంలో 2019 మెగా మేనల్లుడికి కొత్త ఊపిరి పోసింది కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రలహరి సినిమా. అరడజన్ పాపులకు ఫుల్ స్టాప్ పెట్టిన సాయి.. ఇప్పుడు ప్రతి రోజు పండగే సినిమాతో మరో విజయం అందుకున్నాడు. ఇలా ఈ ఏడాది రెండు విజయాలతో తన కెరీర్ గాడిలో పడేలా చేసుకున్నాడు మెగా మేనల్లుడు.

నాచురల్ స్టార్ నాని కూడా 2019 అంత ఈజీగా మరచిపోలేడు. ఈయన కెరీర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఈ ఏడాది గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ సినిమా మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. అందులో నాని నటన అద్భుతం అనే ఒక్క మాటతో సరిపోదు. క్రికెటర్ అర్జున్ పాత్రలో నటించడం కాదు జీవించాడు నాచురల్ స్టార్. అప్పటి వరకూ చిన్న సినిమాలు తీస్తూ వచ్చిన అనిల్ రావిపూడికి కూడా 2019 బాగా కలిసొచ్చింది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా ఈయన తెరకెక్కించిన ఎఫ్2 సినిమా సంచలన విజయం సాధించింది. దాంతో అనిల్ రావిపూడి అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ప్రస్తుతం మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ కుర్ర దర్శకుడు.

కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో డీలా పడిపోయిన రామ్ 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక దేశముదురు తర్వాత మరో బ్లాక్ బస్టర్ కోసం పన్నెండేళ్లుగా కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్న పూరి జగన్నాథ్ 2019 అసలు సిసలైన బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈయన తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మాస్ ప్రేక్షకులతో డాన్స్ లు చేయించింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమాను మొదలుపెట్టాడు పూరి జగన్నాథ్. నవీన్ పొలిశెట్టికి కూడా 2019 ప్రత్యేకంగా మారిపోయింది. యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఉన్న నవీన్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరో అయ్యాడు.. గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ 2019లో మీకు మాత్రమే చెప్తా హీరో అయ్యాడు. ఇలా కొందరు విజయాలు అందుకుని మరికొందరు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 2019ని ప్రత్యేకంగా మార్చుకున్నారు. 

More Related Stories